CCLA: ‘కన్ఫర్డ్’లుగా 17 మంది సిఫారసు!
ABN , Publish Date - Aug 20 , 2025 | 04:54 AM
భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే జాబితాలో 17 మంది డిప్యూటీ తహసీల్దార్ (డీటీ) క్యాడర్‌కు చెందిన
డిప్యూటీ తహసీల్దార్ క్యాడర్‌కు చెందిన స్పెషల్, సెలెక్షన్ గ్రేడ్ అధికారులను రికమండ్ చేసిన సీసీఎల్‌ఏ
హైదరాబాద్, ఆగస్టు19 (ఆంధ్రజ్యోతి): భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే జాబితాలో 17 మంది డిప్యూటీ తహసీల్దార్ (డీటీ) క్యాడర్‌కు చెందిన స్పెషల్ గ్రేడ్, సెలెక్షన్ గ్రేడ్ అధికారులను కన్ఫర్డ్ ఐఏఎ్‌సలుగా సిఫారసు చేసింది. ఈ 17 మంది కూడా ప్రస్తుతం ఆర్డీవో, డిప్యూటీ కలెక్టర్ హోదాలకన్నా పైస్థాయిలో ఉన్నవారే! అయితే ఇంతపెద్ద సంఖ్యలో సీసీఎల్‌ఏ సిఫారసు చేయడం తెలుగు రాష్ట్రాల నుంచి ఇదే మొదటిసారి కావడం విశేషం.
సీసీఎల్‌ఏ సిఫారసు చేసిన 17 మంది కూడా 1994లో డిప్యూటీ తహసీల్దార్లుగా నియామకమైన వారే! సాధారణంగా రాష్ట్ర రెవెన్యూ సర్వీసు నుంచి ఎవరైనా కన్ఫర్డ్ ఐఏఎస్ పొందాలంటే 56ఏళ్ల లోపు వయసు, వరుసగా ఎనిమిది ఏళ్ల పాటు డిప్యూటీ కలెక్టర్‌గా చేసి ఉండాలి. అయితే ఇటీవల తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసు నిబంధనలను ప్రభుత్వం సవరించడం గమనార్హం.