Share News

PM Modi: మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిస్తోంది : మోదీ

ABN , Publish Date - Aug 10 , 2025 | 09:37 PM

ఆపరేషన్ సిందూర్‌ సమయంలో సరికొత్త భారత్‌ను ప్రపంచం మొదటిసారి చూసిందని ప్రధాని మోదీ తెలిపారు. భారత భద్రతా బలగాలు పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలను కొన్ని గంటల్లోనే మట్టికరిపించాయని పేర్కొన్నారు.

PM Modi: మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిస్తోంది : మోదీ
PM Modi

బెంగళూరు: ఆపరేషన్‌ సిందూర్‌ విజయంలో బెంగళూరుకు కూడా భాగస్వామ్యం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇవాళ (ఆదివారం) ఆయన నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా మూడు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.


ఆపరేషన్ సిందూర్‌ సమయంలో సరికొత్త భారత్‌ను ప్రపంచం మొదటిసారి చూసిందని ప్రధాని మోదీ తెలిపారు. భారత భద్రతా బలగాలు పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలను కొన్ని గంటల్లోనే మట్టికరిపించాయని పేర్కొన్నారు. ఈ విజయానికి టెక్నాలజీ, రక్షణా రంగంలో మేక్ ఇన్ ఇండియా శక్తి దోహదపడ్డాయని ప్రధాని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా భారత్‌ వేగంగా అడుగులు వేస్తోందని చెప్పుకొచ్చారు. 2014కు ముందు కేవలం ఐదు నగరాలకే పరిమితమైన మెట్రో సేవలు.. ప్రస్తుతం 24 నగరాలకు విస్తరించాయని మోదీ వివరించారు.


మౌలిక సదుపాయాల కల్పనలో బెంగళూరు రోల్‌మోడల్‌‌గా నిలుస్తోందని ప్రధాని తెలిపారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్ దేశంగా భారత్‌ ఉందని గుర్తుచేశారు. భారత్‌లో 2014లో 74 విమానాశ్రయాలే ఉన్నాయని, ప్రస్తుతం భారత్‌లో 160 విమానాశ్రయాలు ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలో ఆరోగ్యం, విద్యా రంగాల్లో కీలక మార్పులు తీసుకొచ్చామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి

రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి

ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? మారటోరియం?

Updated Date - Aug 10 , 2025 | 09:54 PM