Home » Karnataka News
వందేమాతరంపై కర్ణాటక అసెంబ్లీ, విధానసభలో సోమవారం కాసేపు రచ్చ జరిగింది. అధికార పార్టీ నేతలు వందేమాతరంలోని రెండు చరణాలే పాడగా.. ప్రతిపక్ష బీజేపీ నేతలు మొత్తం చరణాలను పాడారు. తర్వాత ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు.
కర్ణాటకలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వాల్మీకి కార్పొరేషన్‌లో రూ.187 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో మంత్రి బి. నాగేంద్ర తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
మేకెదాటు ప్రాజెక్ట్ నిర్మాణానికి త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ సమస్యను పరిష్కరించడంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జోక్యం కూడా అవసరమని ఆయన కోరారు.
హైదరబాద్- బెళగావి(కర్ణాటక) మార్గంలో ఆరు కొత్త రైళ్లను ప్రారంభిస్తున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.
తుంగభద్ర జలాశయంలో నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఎండల తీవ్రత ఒక కారణమైతే, జలాశయం భద్రత దృష్ట్యా చేపట్టిన క్రస్ట్‌గేట్ల ఆధునికీకరణ పనులు నీటి నిలువలపై ప్రభావం చూపుతున్నాయి.
ఆపరేషన్ సిందూర్ సమయంలో సరికొత్త భారత్‌ను ప్రపంచం మొదటిసారి చూసిందని ప్రధాని మోదీ తెలిపారు. భారత భద్రతా బలగాలు పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలను కొన్ని గంటల్లోనే మట్టికరిపించాయని పేర్కొన్నారు.
కామిక్ పుస్తకాల్లో రూ.40 కోట్ల విలువైన కొకైన్‌ను దాచి తీసుకొచ్చిన ఓ వ్యక్తిని బెంగళూరు ఎయిర్‌పోర్టులో డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. అతడి నుంచి 4 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
బెంగళూరు తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబాలకు పరిహారాన్ని రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచినట్టు కర్ణాటక ప్రభుత్వం తాజాగా పేర్కొంది.
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన కర్ణాటక అత్యాచార కేసులో నిందితులను పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. బెయిల్‌పై విడుదలైన నిందితులు భారీ ఊరేగింపు నిర్వహించడంతో వారిని మళ్లీ అరెస్టు చేశారు.
కర్ణాటకలో షాకింగ్ ఉదంతం వెలుగు చూసింది. పెళ్లి వేడుకల్లో ఓ వరుడు హార్ట్‌ఎటాక్‌తో కుప్పకూలిపోయాడు. తాళి కట్టిన కొన్ని నిమిషాలకే మరణించాడు.