Share News

Trains: ప్రయాణికులకు బిగ్ అలెర్ట్.. 1 నుంచి పలు రైళ్ల వేళల్లో మార్పు

ABN , Publish Date - Dec 24 , 2025 | 09:49 AM

జనవరి ఒకటో తేదీ నుంచి పలు రైళ్ల వేళల్లో మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు. లింగంపల్లి-విశాఖపట్నం మార్గంలో నడిచే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‏కు అనపర్తి స్టేషన్‌లో హాల్ట్‌ కల్పిస్తున్నట్లు తెలిపారు.

Trains: ప్రయాణికులకు బిగ్ అలెర్ట్.. 1 నుంచి పలు రైళ్ల వేళల్లో మార్పు

హైదరాబాద్‌ సిటీ: దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) కొత్తగా రూపొందించిన పబ్లిక్‌ టైం టేబుల్‌-2026 జనవరి 1నుంచి అమల్లోకి వస్తుందని సీపీఆర్‌ఓ శ్రీధర్‌(CPRO Sridhar) తెలిపారు. దీని ప్రకారం జోన్‌ పరిధిలో రాకపోకలు సాగించే పలు ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌ రైళ్ల సమయాల్లో మార్పులు చోటు చేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. లింగంపల్లి-విశాఖపట్నం మార్గంలో నడిచే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ (12805/12806)కు అనపర్తి స్టేషన్‌లో హాల్ట్‌ కల్పిస్తున్నట్లు తెలిపారు.


city6.2.jpg

శంకరపల్లి రైల్వేస్టేషన్‌లో రెండు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హాల్ట్‌ కల్పించామన్నారు. నాందేడ్‌ నుంచి సికింద్రాబాద్‌(Nanded to Secunderabad) మీదుగా రాయచూర్‌ మార్గంలో నడిచే పర్బానీ ఎక్స్‌ప్రెస్‌(17663/17664), హైదరాబాద్‌ (నాంపల్లి)నుంచి బీజాపూర్‌ మార్గంలో నడిచే విజయపుర(17030) ఎక్స్‌ప్రెస్‌.. శంకరపల్లి రైల్వేస్టేషన్‌(Shankarpalli Railway Station)లో ఒక నిమిషం పాటు ఆగుతాయని వెల్లడించారు.


city6.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ దూకుడు

నిరాశ వదిలించి...నవజీవనం వైపు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 24 , 2025 | 11:29 AM