Home » Telangana BJP
అత్యధిక పన్ను కడుతున్న హిందువుల సొమ్మును ముస్లింలకు దోచి పెడుతున్నారని బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి ఆరోపణలు చేశారు. మూసీ ప్రాజెక్టుకు డీపీఆర్ లేదని.. తోక లేదని ఎద్దేవా చేశారు. దోచుకోవడానికి అప్పుడు కాళేశ్వరం.. ఇప్పుడు మూసీని తెరమీదకు తెచ్చారని దెప్పిపొడిచారు.
కేసీఆర్ హయాంలో సర్పంచులు పనిచేసిన బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమలు చేసే ప్రతి పథకాన్ని ఇక్కడ కూడా అమలు చేసేలా పాలకవర్గం చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘునందన్ రావు సూచించారు.
ప్రతి ఒక్క హిందువుతోపాటు ప్రతీ భారతీయుడు తప్పకుండా చూడాల్సిన సినిమా నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ -2 అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ధర్మాన్ని దారి తప్పిన వాళ్లకు ఈ సినిమా ఓ గుణపాఠమని పేర్కొన్నారు.
బావ, బామ్మర్థులతో అవ్వట్లేదని కేసీఆర్ను బయటకు తెచ్చారని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. కేసీఆర్ బయటికి వచ్చిన తెలంగాణ రాజకీయంలో ఎలాంటి ప్రభావం ఉండదని విమర్శించారు. డబ్బులు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ సభలు పెడుతున్నారని ఆరోపించారు.
డ్రగ్స్ కేసులపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబసభ్యుల భవిష్యత్ నాశనమవుతుందనే భయంతోనే.. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఈ కేసు నీరుగార్చారని ఆరోపించారు.
తెలంగాణ బీజేపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో నీటి ప్రాజెక్టులపై అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక కమిటీ వేసి ప్రాజెక్టులను సందర్శించనున్నారు టీబీజేపీ నేతలు.
గోవా వంటి ప్రాంతాల్లో క్రిస్టియన్ సమాజం బీజేపీకి మద్దతు పలుకుతోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు వ్యాఖ్యానించారు. భారత్లో అన్ని మతాలను గౌరవంగా, సమన్వయంగా చూస్తామని పేర్కొన్నారు.
ప్రముఖ సినీనటి ఆమని శనివారం భారతీయ జనతా పార్టీలో అధికారికంగా చేరనున్నారు. ఈ చేరిక కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జరగనుంది. కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఆధ్వర్యంలో ఆమె కాషాయ కండువా కప్పుకోనున్నారు.
జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరును మోదీ ప్రభుత్వం మారుస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా బీజేపీ ఆఫీసుల ఎదుట భారీ ధర్నా చేపట్టాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీతో జరిగిన సమావేశంలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని మాత్రమే చెప్పారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేయాలని మోదీ కోరారని తెలిపారు.