ఎన్నికల్లో ఓడిపోయామని బాధపడకండి.. గులాబీ శ్రేణులకు ధైర్యం చెప్పిన కేటీఆర్
ABN , Publish Date - Feb 13 , 2026 | 05:42 PM
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ వేదికగా కేటీఆర్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామని వ్యాఖ్యానించారు. తమ విజయంతో కాంగ్రెస్ నేతల నోళ్లు మూతపడ్డాయని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో మనం ఓడిపోయామని బాధపడొద్దని గులాబీ శ్రేణులకు ధైర్యం చెప్పారు. ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అన్నవాళ్లు చరిత్రలో కలిశారని కేటీఆర్ అన్నారు. రేవంత్‌రెడ్డికి దమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు.
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు బాగా పనిచేశారని కేటీఆర్ ప్రశంసించారు. 117 స్థానాల్లో మాకు మంచి ఫలితాలు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. పలు జిల్లాల్లో అధికార దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని విమర్శించారు. సింగరేణి ప్రాంతంలో సీపీఐతో కలిసి పోటీ చేశామన్న కేటీఆర్.. కాంగ్రెస్, బీజేపీని అడ్డుకునేందుకే సీపీఐతో కలిసి పోరాడామని చెప్పుకొచ్చారు. కొత్తగూడెం కార్పొరేషన్‌లో సీపీఐకి మద్దతిచ్చామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
'ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా.. మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎక్కడ?'
మున్సిపల్ ఎన్నికల అప్‌డేట్స్.. 52 వార్డులు కాంగ్రెస్ కైవసం
Read Latest Telangana News And AP News And Telugu News