తెలంగాణలో హత్యలు, దారుణాలు పెరిగాయి.. సీఎం రేవంత్‌పై డీకే అరుణ ధ్వజం
ABN , Publish Date - Feb 09 , 2026 | 02:08 PM
సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దారుణాలు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు.
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 9, (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డిపై(CM Revanth Reddy) బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ(BJP MP DK Aruna) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దారుణాలు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత ట్యాక్స్‌లు పెంచేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమవుతోందని ఆరోపించారు. రాష్ట్ర ఖజానాలో చిల్లిగవ్వ లేదని చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమవుతోందని విమర్శించారు.
కేంద్ర నిధులు అవసరం..
మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని అరుణ తెలిపారు. అన్ని మున్సిపాలిటీల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు ప్రచారం నిర్వహించానని చెప్పుకొచ్చారు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్, భూత్‌పూర్, జడ్చర్ల మున్సిపాలిటీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ నిధులు అవసరముందని ఎంపీ అన్నారు.
అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్..
మహబూబ్‌నగర్ చుట్టుపక్కల గ్రామాలు విలీన గ్రామాలుగా కలిశాయని ఎంపీ అరుణ వివరించారు. కార్పొరేషన్ అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ కూడా అవసరం ఉందని చెప్పుకొచ్చారు. పట్టణాల్లో స్లమ్ ఏరియాలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. బీజేపీ అభ్యర్థులు ఎన్నికల్లో గెలవగానే సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తామని తెలిపారు. అవినీతి రహిత, పారదర్శకమైన పాలన అందించడమే బీజేపీ లక్ష్యమని ఉద్ఘాటించారు. ప్రతి వార్డులో డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ తదితర అంశాలపై దృష్టి సారించి.. కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. బీజేపీ మేనిఫెస్టోను ప్రజలకు అనుకూలంగా తయారుచేసి, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని డీకే అరుణ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పాడి గేదెల పేరుతో భారీ మోసం.. పశువులను ఇంటికే పంపిస్తామంటూ..
రేవంత్‌రెడ్డి పాలనలో.. బస్సు తప్ప అన్నీ తుస్సే.. హరీశ్‌రావు సెటైర్లు
Read Latest Telangana News And AP News And Telugu News