కస్టమర్‌కు షాక్.. సమోసాలో పిన్నులు..
ABN , Publish Date - Feb 01 , 2026 | 06:59 AM
స్వీట్ షాపులో సమోసా తిన్న కస్టమర్‌కు ఊహించని షాక్ తగిలింది. సమోసాలో పిన్నులు బయటపడ్డాయి. నాగర్ కర్నూలు జిల్లాలో గురువారం చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 1: నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. స్వీట్ షాపులో సమోసా తిన్న కస్టమర్‌కు ఊహించని షాక్ తగిలింది. సమోసాలో పిన్నులు బయటపడ్డాయి. గురువారం చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బిజినేపల్లి మండల కేంద్రంలో ఓ ప్రముఖ స్వీట్ షాపు ఉంది. చుట్టు పక్కల గ్రామాల వారు అక్కడ తినుబండారాలు కొనుక్కోవడానికి పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. గురువారం సంత రోజున ఓ వ్యక్తి స్వీట్ షాపులో ఓ సమోసా కొన్నాడు.
ఎంతో ఇష్టంగా దాన్ని తింటూ ఉండగా ఊహించని షాక్ తగిలింది. నోట్లో ఏదో గుచ్చుకున్నట్లు అనిపించింది. వెంటనే నోట్లో ఉన్న దాన్ని బయటకు కక్కాడు. స్టాప్‌లర్ పిన్ను బయటపడింది. సమోసాలో మరో పిన్ను కూడా వెలుగు చూసింది. దీంతో ఆ కస్టమర్ షాపు యజమానితో గొడవ పెట్టుకున్నాడు. మొత్తానికి విషయం బయటకు రాకుండా సర్దుబాటు జరిగింది. అయితే, సమోసాలో పిన్ను ఉన్న దృశ్యాన్ని ఓ యువకుడు ఫొటో తీశాడు. దాన్ని తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశాడు. ఆ ఫొటో కాస్తా వైరల్‌గా మారింది.
గతంలో బల్లి..
గతేడాది జులై నెలలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో సమోసాలో బల్లి వెలుగు చూసింది. ఓ ఇద్దరు పిల్లలు మొయినాబాద్‌లోని ఓ ప్రముఖ షాపులో సమోసాలు కొని తింటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక దానిలో బల్లి వెలుగుచూసింది. అది గమనించిన పిల్లలు వాంతులు చేసుకోవటం మొదలెట్టారు. తల్లిదండ్రులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. షాపు యజమాని తన దుకాణం మూసేసి పరార్ అయ్యాడు. అప్పట్లో ఈ సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
ఇవి కూడా చదవండి
వచ్చే పొంగల్‌కి మళ్లీ వస్తా...
అనంతగిరిలో డీసీసీ అధ్యక్షుల శిక్షణా శిబిరం