Share News

Suspicion of Infidelity: వివాహేతర సంబంధం అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త

ABN , Publish Date - Aug 25 , 2025 | 04:44 AM

ఓ యువకుడు తన భార్యకు వివాహేతర సంబం ధం ఉందనే అనుమానంతో అడవిలోకి తీసుకెళ్ళి హత్యచేసి, అనంతరం పెట్రోల్‌ పోసి కాల్చేసిన ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో జరిగింది.

Suspicion of Infidelity: వివాహేతర సంబంధం అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త

  • అడవిలోకి తీసుకెళ్లి పెట్రోల్‌ పోసి దహనం

  • సోమశిల వెళ్దామని నమ్మించి దారుణం

పెద్దకొత్తపల్లి/మహబూబ్‌నగర్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ఓ యువకుడు తన భార్యకు వివాహేతర సంబం ధం ఉందనే అనుమానంతో అడవిలోకి తీసుకెళ్ళి హత్యచేసి, అనంతరం పెట్రోల్‌ పోసి కాల్చేసిన ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో జరిగింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలంలోని కొత్తరాయవరం గ్రామానికి చెందిన శ్రీశైలం, దేవరకద్రకు చెందిన శ్రావణి (27) పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో శ్రావణి కొన్నాళ్లుగా పిల్లలతో కలిసి మహబూబ్‌నగర్‌లో నివాసం ఉంటోంది. శ్రీశైలం హైదరాబాద్‌లోని యూసు్‌ఫగూడలో వెల్డర్‌గా పని చేస్తున్నాడు. భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో తరుచూ ఆమెతో గొడవ పడేవాడు.


విసిగిపోయిన ఆమె జనవరిలో మహిళా పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సోమశిలకు వెళ్ళివద్దామని నమ్మించిన శ్రీశైలం ఈ నెల 21న మహబూబ్‌నగర్‌కు వచ్చి, భార్యను బైక్‌పై తీసుకెళ్లాడు. పథకం ప్రకారం కత్తి, పెట్రోల్‌ను బైక్‌ కవర్‌లో ఉంచుకున్నాడు. పెద్దకొత్తపల్లి మండలంలోని సాతాపూర్‌ అడవిలోకి తీసుకెళ్లి కత్తితో పొడిచి హత్య చేశాడు. తర్వాత మృతదేహానికి పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. కూతురు నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో అనుమానించిన ఆమె తల్లి శనివారం టూటౌన్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అదేరోజు రాత్రి శ్రీశైలం పోలీసుల వద్ద లొంగిపోయాడు.

Updated Date - Aug 25 , 2025 | 04:44 AM