Property Dispute: ఆస్తి కోసం తండ్రిని చంపిన కసాయి కొడుకు
ABN , Publish Date - Sep 06 , 2025 | 05:13 AM
ఆస్తి కోసం కన్నతండ్రి ప్రాణాలు తీశాడు ఓ కసాయి కొడుకు. వృద్ధాప్యంలో తండ్రికి తోడుగా ఉండాల్సిన కుమారుడే.. కొట్టి చంపి వాగులో వేసిన ఘటన నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో జరిగింది
కల్వకుర్తి/ఉప్పునుంతల, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఆస్తి కోసం కన్నతండ్రి ప్రాణాలు తీశాడు ఓ కసాయి కొడుకు. వృద్ధాప్యంలో తండ్రికి తోడుగా ఉండాల్సిన కుమారుడే.. కొట్టి చంపి వాగులో వేసిన ఘటన నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో జరిగింది. వాసవీ నగర్ కాలనీకి చెందిన బాలయ్య(70) గురువారం తన పొలంలో పని చేసుకుంటుండగా.. అతని కుమారుడు బీరయ్య వచ్చి దాడికి దిగాడు. అనంతరం తండ్రిని తన బావమరిది సాయంతో కారు ఢిక్కీలో తీసుకెళ్లి డిండి చింతపల్లి బ్రిడ్జి వద్ద దుందుభి వాగులో పడేశాడు. తన అన్న బాలయ్య ఎంతకీ ఇంటికి రాకపోవడంతో అతని ఆచూకీపై తమ్ముడు మల్లయ్య శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో సీఐ బి. నాగార్జున, ఎస్సై మాధవరెడ్డి బృందం విచారణ చేపట్టి.. సీసీటీవీ ఫుటేజీ, ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా బీరయ్యను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే మూడు ఎకరాలు అమ్ముకున్న తండ్రి ఉన్న ఒక ఎకరా కూడా అమ్ముకుంటాడనే కోపంతో తండ్రిని చంపానని నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. బాలయ్య కోసం డ్రోన్ కెమెరా, గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా శుక్రవారం రాత్రి మృతదే హం లభ్యమైంది.