Home » BRS Chief KCR
‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకు గోస తప్పదని కేసీఆర్ ఆనాడే చెప్పారు. ఇప్పుడు అదే వాస్తవమైంది’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
దానం నాగేందర్ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు కేసీఆర్‌కే చెంపపెట్టు లాంటిదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడు కేసీఆరేనని, ఫిరాయింపులపై ఇప్పుడు బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
ఈనెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశం 6న నిర్వహించాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధికి అష్టదరిద్రులు అడ్డం పడుతున్నారని ధ్వజమెత్తారు. కాళ్లలో కట్టెలు పెట్టినా.. మూసీలో పడి దొర్లినా వాళ్లను పట్టించుకోమని విమర్శించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. జగిత్యాల సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి తన అనుచరులతో కలిసి భారత రాష్ట్ర సమితి (BRS)లో చేరారు.
సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఓటుకు నోటు కేసు సాక్ష్యాలను కాల్చేశారని ఆరోపించారు..
కాంగ్రెస్, బీజేపీలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు.
మాజీ సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కేసీఆర్‌ని గజగజ వణికించానని, తన తలకాయను కేసీఆర్ ఆరు ముక్కలు చేస్తానని గతంలో అన్నారని ఆరోపించారు. ఆయన సంగతి తేల్చేందుకు ఫామ్‌హౌస్‌కు వస్తానని తాను చెప్పానని అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీజేపీ మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్ విచారణ త్వరలో పూర్తవ్వాలని, దోషులను జైలుకు పంపాలని కోరారు.
ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పందిస్తూ.. చట్టం తన పని తాను చేస్తోందని స్పష్టం చేశారు. భార్యాభర్తల సంభాషణలు వినే దుశ్చర్యకు పాల్పడితే విచారణ జరపాలా, వద్దా అని ప్రశ్నించారు.