Share News

ఓటుకు నోటు కేసు సాక్ష్యాలను కాల్చేశారు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Feb 09 , 2026 | 01:50 PM

సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఓటుకు నోటు కేసు సాక్ష్యాలను కాల్చేశారని ఆరోపించారు..

ఓటుకు నోటు కేసు సాక్ష్యాలను కాల్చేశారు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
KTR

జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 9, (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఓటుకు నోటు కేసు సాక్ష్యాలను కాల్చేశారని ఆరోపించారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.


అనుచిత వ్యాఖ్యలు చేసే సీఎం రేవంత్‌రెడ్డికి పోలింగ్ కేంద్రంలోనే బుద్ధి చెప్పాలని అన్నారు. 420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. భూపాలపల్లి సింగరేణిని ఆగం చేసేందుకు చూస్తున్నారని ఆరోపణలు చేశారు. తులం బంగారం, రూ.4వేల పెన్షన్ వచ్చినోళ్లు కాంగ్రెస్‌కు ఓటేయాలని అన్నారు. కేసీఆర్ పథకాలు తీసుకుంటున్న వాళ్లు బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఇవ్వాళ, రేపు మద్యం, డబ్బులు పంచి ఓట్లు వేయించుకోవాలని చూస్తారని ఎద్దేవా చేశారు. మరోసారి మోసపోయి భస్మాసుర చేయి లాంటి కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దని సూచించారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని పట్టించుకోలేదని ఆగ్రహించారు. 12ఏళ్లలో తెలంగాణకు బీజేపీ నయాపైసా పనిచేయలేదని ఫైర్ అయ్యారు.


కేటీఆర్ పర్యటనలో ఉద్రిక్తత..

జయశంకర్ భూపాలపల్లిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కేటీఆర్ వచ్చారు. ఆయన పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేటీఆర్ కార్నర్ మీటింగ్ సందర్భంగా సామాజిక కార్యకర్త, దివంగత రాజలింగమూర్తి ఫ్లెక్సీ తొలగించారు. కేటీఆర్ కార్నర్ మీటింగ్ నేపథ్యంలో రాజలింగమూర్తి ఫ్లెక్సీ తొలగింపుపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. త​మ తండ్రి ఫ్లెక్సీని కావాలనే బీఆర్ఎస్ నేతలు తొలగించారంటూ రాజలింగమూర్తి కుమార్తె ఆరోపించారు. ఈ క్రమంలో రాజలింగమూర్తి కుమార్తె రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మా నాన్నను బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, గండ్ర వెంకటరమణారెడ్డి, హరిబాబు కలిసి హత్య చేశారని ఆమె ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పాడి గేదెల పేరుతో భారీ మోసం.. పశువులను ఇంటికే పంపిస్తామంటూ..

రేవంత్‌రెడ్డి పాలనలో.. బస్సు తప్ప అన్నీ తుస్సే.. హరీశ్‌రావు సెటైర్లు

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 09 , 2026 | 02:23 PM