Home » Bhupalpalle
సాదా బైనామాలకు అడ్డంకులు తొలిగాయి. ఐదున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న రైతుల నిరీక్షణకు తెరపడింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2020లో తీసుకువచ్చిన 112జీవో స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకరావటంతో పాటు ప్రభుత్వం సాదా బైనామాల పరిష్కారంపై విధివిదానాలను హైకోర్టుకు సమర్పించింది. దీంతో హైకోర్టు తన ముందు ఉన్న పిల్‌ను కొట్టివేసింది. ప్రభుత్వం సాదా బైనామాల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
తాగునీటిలో విషం కలిపి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడిన భూపాలపల్లి అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల ఉపాధ్యాయుడు పెండ్యాల రాజేందర్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది.
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 12 రోజుల పాటు సాగిన సరస్వతి పుష్కరాలు సోమవారం ముగిశాయి. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా వచ్చిన ఈ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది.
సరస్వతీ నది పుష్కరాలకు వెళుతున్న కుటుంబమొకటి.. పుష్కర స్నానం చేసి తిరిగొస్తున్న కుటుంబం మరొకటి! ఇరు కుటుంబాలు ప్రయాణిస్తున్న కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందగా 13 మంది గాయపడ్డారు.
దక్షిణ కాశీగా పేరొందిన కాళేశ్వరం అభివృద్ధికి ఎంత ఖర్చయినా నిధులు మంజూరు చేస్తామని, వెంటనే మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
తెలంగాణలో సరస్వతీ పుష్కరాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. మే15వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు పన్నెండు రోజుల పాటు ఈ పుష్కరాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలను ప్రారంభించారు.
సరస్వతి నది పుష్కరాలకు రాష్ట్రంలో సర్వం సిద్ధమైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమంలో గురువారం తెల్లవారుజాము నుంచి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి.
జయశంకర్ భూపాలపల్లిజిల్లా పరిధిలో ఈ నెల 15 నుంచి 31 వరకు సరస్వతి నది పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ తరఫున ప్రత్యేకాధికారులను నియమించారు.
ఆడపిల్లకు జన్మనిచ్చినందుకు తమకు అదనంగా రూ. లక్ష కట్నం ఇవ్వాలని భర్త, అతని కుటుంబసభ్యులు వేధిస్తుండడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ బాలింత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
తెలంగాణలో భారీ గాలివానతో పలు జిల్లాల్లో ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. మరోవైపు తీవ్రమైన ఎండలతో వడదెబ్బకు ఒకరు మృతి చెందగా, ఎన్‌హెచ్‌ఆర్సీ వడదెబ్బ నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించింది.