Share News

స్కూల్ బస్సులో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

ABN , Publish Date - Feb 07 , 2026 | 08:13 PM

విద్యార్థులతో వెళుతున్న ఒక ప్రైవేట్ స్కూల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలిపోయింది. అదృష్టం కొద్దీ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. వివరాల్లోకి వెళితే..

స్కూల్ బస్సులో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
School Bus Fire Telangana

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: చిట్యాల(Chitya) మండలం చల్ల గ్రామానికి చెందిన​ ఓ ప్రైవేటు పాఠశాల బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే, ప్రమాద సమయంలో బస్సులో 15 మంది విద్యార్థులు ఉన్నారు. డ్రైవర్, గ్రామస్థులు వెంటనే అప్రమత్తమై పిల్లల్ని బస్సు నుంచి కిందకు దింపడంతో పెద్ద ప్రమాదం తప్పింది.


ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్(Short circuit) కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనపై రవాణా శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. స్కూల్ బస్ ఫిట్ నెస్ తోపాటు మంటలు రావడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో విద్యార్థులకు ఎటువంటి గాయాలు, ప్రాణ నష్టం జరగకపోవడంతో తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు.


ఇవి కూడా చదవండి..

భారత రైతులకు పూర్తి రక్షణ.. ట్రేడ్‌ డీల్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

అరేబియా సముద్రంలో చమురు స్మగ్లింగ్.. ఆట కట్టించిన కోస్ట్ గార్డ్..

Updated Date - Feb 07 , 2026 | 08:55 PM