Share News

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో విమానానికి బాంబు బెదిరింపు

ABN , Publish Date - Feb 12 , 2026 | 10:20 AM

శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు పెరిగిపోతున్నాయి. తాజాగా మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. గల్ఫ్ ఎయిర్‌లైన్స్‌ విమానానికి బెదిరింపు మెయిల్‌ వచ్చింది. వెంటనే ఎయిర్‌పోర్టు అధికారులు అప్రమత్తం అయ్యారు.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో విమానానికి బాంబు బెదిరింపు
Shamshabad Airport bomb threat

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు (Shamshabad Airport Bomb Threat) పెరిగిపోతున్నాయి. తాజాగా మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. గల్ఫ్ ఎయిర్‌లైన్స్‌ విమానానికి బెదిరింపు మెయిల్‌ వచ్చింది. వెంటనే ఎయిర్‌పోర్టు అధికారులు అప్రమత్తం అయ్యారు. విమాన ప్రయాణికుల రక్షణను దృష్టిలో ఉంచుకుని, భద్రతా సిబ్బంది అత్యంత వేగంగా స్పందించి తనిఖీలు చేపట్టారు. ఎయిర్‌పోర్టులో తనిఖీలు చేసి బాంబు లేదని తేల్చారు అధికారులు. ఈ మెయిల్‌పై ఎయిర్‌పోర్ట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చివరికి అదొక బెదిరింపు మాత్రమేనని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


ఏం జరిగిందంటే..?

గల్ఫ్ ఎయిర్‌లైన్స్‌ విమానానికి బాంబు బెదిరింపు మెయిల్‌ వచ్చింది. సదరు విమానంలో బాంబు ఉందని ఈ మెయిల్‌లో ఆగంతకులు హెచ్చరించారు. ఈ మెయిల్ రాగానే ఎయిర్‌పోర్ట్ అధికారులు, భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. గంటల తరబడి చేసిన తనిఖీల తర్వాత, విమానంలో ఎలాంటి బాంబు లేదని అధికారులు తేల్చిచెప్పారు. ఇది కేవలం బెదిరింపుల కోసమే చేసినట్లు అధికారులు నిర్ధారించారు.


పోలీసుల దర్యాప్తు..

బాంబు బెదిరింపు ఈ మెయిల్ రావడంతో విమానాశ్రయంలో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. విమానాశ్రయ భద్రతా అధికారులు వెంటనే స్థానిక ఎయిర్‌పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది..? ఎవరు పంపారు..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బెదిరింపులు పంపడం తీవ్రమైన నేరమని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తతలు.. పలు పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణలు

మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ విభజన

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 12 , 2026 | 10:59 AM