Telangana Drug Control: ప్రజలకు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ కీలక హెచ్చరికలు..
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:40 AM
ఆల్మంట్- కిడ్ సిరప్ వినియోగంపై తెలంగాణ డ్రగ్ కంట్రోల్ నిషేధం విధించింది. ఆల్మంట్- కిడ్ సిరప్ వినియోగాన్ని వెంటనే నిలిపేయాలని ఆదేశాలు జారీ చేసింది..
హైదరాబాద్, జనవరి 10: ప్రజలకు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ (Telangana Drug Control) కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆల్మంట్- కిడ్ సిరప్ వినియోగాన్ని వెంటనే నిలిపేయాలని ఆదేశించింది. పిల్లలకు అలర్జీ, జ్వరం, ఆస్తమా వంటి సమస్యలకు ఆల్మంట్ - కిడ్ సిరప్‌ను వినియోగిస్తుంటారు. అయితే ఈ సిరప్‌లో విషపూరితమైన ఇథలీన్ గ్లైకాల్ కలుషితమై ఉన్నట్లు గుర్తించారు. కోల్‌కతాలోని సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన రిపోర్ట్ ఆధారంగా తెలంగాణ డ్రగ్ కంట్రోల్ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది.
ఎవరైనా ఈ సిరప్ నియోగిస్తుంటే తక్షణమే నిలిపేయాలని టీజీసీఏ సూచనలు చేసింది. అలాగే సిరప్ వినియోగ సమాచారాన్ని సమీప డ్రగ్ కంట్రోల్ అధికారికి ఇవ్వాలని సూచించింది. పిల్లలకు వాడే సిరప్ కావడంతో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇథిలీన్ గ్లైకాల్ వల్ల కిడ్నీ సమస్యలు, న్యూరాలజికల్ డ్యామేజ్ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా పిల్లల సిరప్‌లలో ఇలాంటి కలుషితాలు గుర్తిస్తుడడం వల్ల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
దారుణం.. యువకుడిని అతి కిరాతకంగా..
ఐఏఎస్ అధికారిపై తప్పుడు కథనం.. ఐఏఎస్ సంఘం రియాక్షన్ ఇదే..
Read Latest Telangana News And Telugu News