Share News

Baba Vanga 2026 predictions: బాబా వంగా చెప్పింది నిజమవుతుందా.. మూడో ప్రపంచ యుద్ధం తప్పదా..

ABN , Publish Date - Jan 11 , 2026 | 09:52 AM

2026లో మూడో ప్రపంచ యుద్ధం జరగబోతోందా? ఈ ఏడాది ప్రారంభంలోనే జరుగుతున్న వరుస సంఘటనలు చూస్తుంటే నమ్మక తప్పని పరిస్థితి నెలకొంది. బాబా వంగా చెప్పింది నిజమయ్యే అవకాశాలున్నాయనే భయాందోళనలు కూడా మొదలయ్యాయి.

Baba Vanga 2026 predictions: బాబా వంగా చెప్పింది నిజమవుతుందా.. మూడో ప్రపంచ యుద్ధం తప్పదా..
Baba Vanga future predictions

బల్గేరియా జ్యోతిష్యురాలు బాబా వంగా చెప్పింది నిజమవుతోందా? 2026లో మూడో ప్రపంచ యుద్ధం జరగబోతోందా? ఈ ఏడాది ప్రారంభంలోనే జరుగుతున్న వరుస సంఘటనలు చూస్తుంటే నమ్మక తప్పని పరిస్థితి నెలకొంది. బాబా వంగా చెప్పింది నిజమయ్యే అవకాశాలున్నాయనే భయాందోళనలు కూడా మొదలయ్యాయి. 9/11 దాడులు, కోవిడ్-19 వంటి పరిణామాలను ముందే ఊహించిన బాబా వంగా 2026ను యుద్ధం, విధ్వంసం జరిగే సంవత్సరంగా అభివర్ణించారు (Baba Vanga world war 3).


వెనెజువెలాపై అమెరికా సైనిక దాడి, రష్యా – ఉక్రెయిన్ మధ్య పెరుగుతున్న ఘర్షణలు, రష్యా చమురు నౌకలపై అమెరికా దాడులు, ఇరాన్‌లో పెరుగుతున్న అంతర్గత తిరుగుబాటు, తైవాన్‌పై చైనా సైనిక చర్యకు సిద్ధమవుతోందనే వార్తలు.. ఇవన్నీ చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం తప్పదనే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు గ్రీన్‌లాండ్‌పై కన్నేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరప్ దేశాలతో కయ్యానికి సిద్ధమవుతున్నారు. కొలంబియా, మెక్సికో, క్యూబా వంటి దేశాలపై కూడా ట్రంప్ చర్యలకు సిద్ధమవుతున్నారు (Baba Vanga future predictions).


లాటిన్ అమెరికా నుంచి యూరప్ వరకు సాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు బాబా వంగా చెప్పినట్టుగా మూడో ప్రపంచ యుద్దానికి దారితీస్తాయని చాలా మంది భయపడుతున్నారు (mystic predictions 2026). అమెరికా వాణిజ్య యుద్ధాలు, చమురు రాజకీయాలు, సరిహద్దు వివాదాలు, అంతర్గత తిరుగుబాట్లు ప్రపంచాన్ని ఒక అనిశ్చితిలోకి నెట్టేస్తున్నాయి. మరి, ఈ పరిస్థితులు సద్దుమణిగి శాంతి నెలకొంటుందా? లేదా బాబా వంగా చెప్పినట్టు ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుందా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.


ఇవి కూడా చదవండి..

రిపబ్లిక్ డే సేల్‌కు రెడీ అవుతున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటి నుంచంటే..


పసిడి ప్రియులకు షాక్.. ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jan 11 , 2026 | 10:27 AM