Prashant Tamang: ప్రముఖ సింగర్, ఇండియన్ ఐడల్ విన్నర్ కన్నుమూత
ABN , Publish Date - Jan 11 , 2026 | 04:06 PM
ప్రముఖ సింగర్, ఇండియన్ ఐడల్ మూడవ ఎడిషన్ విన్నర్ ప్రశాంత్ తమాంగ్ నేడు కన్నుమూశారు. ఆయన గుండెపోటుతో మరణించినట్టు తెలుస్తోంది. ఆయన మృతిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ సింగర్, ఇండియన్ ఐడల్ (Indian Idol) మూడవ ఎడిషన్ విజేత ప్రశాంత్ తమాంగ్ కన్నుమూశారు. గుండె పోటుతో ఆయన మరణించినట్టు తెలుస్తోంది. ప్రశాంత్ మరణాన్ని ఆయన స్నేహితుడు, ఇండియన్ ఐడల్ కో కంటెస్టెంట్ భవేన్ ధనాక్ ధ్రువీకరించారు. అకస్మాత్తుగా ప్రశాంత్ ఈ లోకాన్ని వీడటం తమను షాక్‌కు గురి చేసిందని చెప్పారు. గుండెపోటుతో ప్రశాంత్ మరణించినట్టు అనుకుంటున్నామని చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు. ప్రశాంత్ కొంతకాలంగా ఢిల్లీలో ఉంటున్నారని ఆయన చెప్పారు. ఇండియన్ ఐడల్ సమయంలో తాము రూమ్ మేట్స్‌గా ఉండేవాళ్లమని కూడా వివరించారు. ఇండియన్ ఐడల్ ద్వారా పాప్యులర్ కాకమునుపు ప్రశాంత్ పశ్చిమ బెంగాల్ పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా పని చేశారు. ఆయన భార్య, ఒక కూతురు ఉన్నారు (Prashanth Tamang Passed Away).
ఇక ప్రశాంత్ మృతిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎక్స్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి వార్త తమను కలచివేసిందని అన్నారు. ఇండియన్ ఐడల్ షోలో రాణించడంతో పాటు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారని తెలిపారు. డార్జిలింగ్‌కు చెందిన ప్రశాంత్ పోలీసు శాఖలో కూడా పనిచేసి రాష్ట్ర ప్రజలకు మరింత దగ్గరయ్యారని అన్నారు. ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు, అభిమానులకు సంఘీభావం తెలిపారు.
సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన బ్యాటిల్ ఆఫ్ గల్వాన్‌లో ప్రశాంత్ ఇటీవల తళుక్కుమన్నారు. 2007లో ఇండియన్ ఐడల్ షోలో విన్నర్‌గా నిలిచారు. గుర్ఖాల సంస్కృతికి అద్దం పట్టేలా ఆయన పాడిన కొన్ని పాటలకు విపరీతమైన పాప్యులారిటీ లభించింది.
ఇవీ చదవండి:
ట్రంప్‌నకు మోదీ ఫోన్ చేయలేదన్న అమెరికా మంత్రి! భారత విదేశాంగ శాఖ స్పందన
https://www.andhrajyothy.com/2026/national/india-us-trade-వీధి కుక్కల అంశంపై విచారణ.. సుప్రీం కోర్టు అసహనం.. కోళ్లు, మేకల ప్రాణాల మాటేంటని ప్రశ్న