Share News

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రికార్డు స్థాయి కేటాయింపులు: వాల్తేర్ డివిజన్ డీఆర్ఎమ్

ABN , Publish Date - Feb 02 , 2026 | 07:28 PM

కేంద్ర బడ్జెట్‌‌లో ఏపీకి రికార్డుస్థాయి కేటాయింపులు జరిగాయని వాల్తేర్ డివిజన్ డీఆర్ఎమ్ తెలిపారు.

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రికార్డు స్థాయి కేటాయింపులు: వాల్తేర్ డివిజన్ డీఆర్ఎమ్
AP railway funds allocation

ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది బడ్జెట్‌లో ఏపీకి రికార్డు స్థాయిలో నిధులు కేటాయించారని వాల్తేర్ డివిజన్ డీఆర్ఎమ్ లలిత్ బోహ్రా తెలిపారు. ₹10,134 కోట్ల నిధులను కేంద్రం కేటాయించిందని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ₹92,649 కోట్ల విలువైన ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మీదుగా హైదరాబాద్–చెన్నై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును కేంద్రం ప్రకటించినట్టు తెలిపారు. దీంతో, కేవలం 2 గంటల 55 నిమిషాలు వ్యవధిలో గమ్యాన్ని చేరుకోవచ్చని అన్నారు. రైల్వే మార్గాలు 100 శాతం విద్యుదీకరణ అవుతాయని చెప్పారు. 73 రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. ఏపీ మీదుగా కోల్‌కతా–చెన్నై ఎకనామిక్ ఫ్రైట్ కారిడార్‌ కూడా ఉంటుందని అన్నారు. 4 లైన్ల రైల్వే మార్గంతో మౌలిక సదుపాయాల బలోపేతం చేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో మరిన్ని అభివృద్ధి ప్రాజెక్టులు కూడా చేపడతామని తెలిపారు.


ఇవీ చదవండి:

జోగి రమేష్ నివాసంపై దాడి, భద్రతపై ఏపీ హైకోర్టులో వాదనలు

చంద్రబాబు వ్యక్తి కాదు.. వ్యవస్థ: పల్లా శ్రీనివాసరావు

Updated Date - Feb 02 , 2026 | 07:35 PM