Share News

చంద్రబాబు వ్యక్తి కాదు.. వ్యవస్థ: పల్లా శ్రీనివాసరావు

ABN , Publish Date - Feb 02 , 2026 | 04:42 PM

ముఖ్యమంత్రి చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని పల్లా శ్రీనివాస రావు డిమాండ్ చేశారు. చంద్రబాబు రాష్ట్రానికి తండ్రిలాగా ఉన్నారన్నారు.

చంద్రబాబు వ్యక్తి కాదు.. వ్యవస్థ: పల్లా శ్రీనివాసరావు

విశాఖపట్నం, ఫిబ్రవరి 2: ముఖ్యమంత్రి చంద్రబాబుపై (CM CHandrababu) వైసీపీ నేత అంబటి రాంబాబు (YCP Leader Amabati Rambabu) చేసిన వ్యాఖ్యలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎంపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత దూషణలను ఆపాలన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్రానికి తండ్రిలాగా ఉన్నారని తెలిపారు. ఆయన ఒక వ్యక్తి కాదని.. వ్యవస్థ అని పేర్కొన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే 70 దేశాలు స్పందించాయని పల్లా శ్రీనివాస రావు గుర్తుచేశారు.


రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ సాఫీగా నడుస్తోందని పల్లా శ్రీనివాస్ తెలిపారు. యువతకు మంచి భరోసా, ఉపాధి అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు పాత్ర లేదని సిట్ తేల్చడం శుభసూచకమని పేర్కొన్నారు. ప్రజలు, రాష్ట్రం గురించే చంద్రబాబు నిత్యం ఆలోచిస్తారన్నారు. ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు 164 సీట్లు ఇచ్చారని.. అదే స్ఫూర్తిగా ముందుకు సాగుతామని ఆయన తెలిపారు. రాష్ట్రం త్వరలో ఐటీ హబ్‌గా మారనుందన్నారు. కేంద్రం ఎంఎస్‌ఎంఈ పార్కులకు మంచి రాయితీలు అందిస్తోందని చెప్పారు. పోలవరం, అమరావతి, అరకు వంటి ప్రాంతాలు రూరల్, అర్బన్ ఎకనామిక్ హబ్‌లుగా మారనున్నాయని చెప్పారు. చంద్రబాబు కృషి వల్లే ఇది సాధ్యమైందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

సీఎంను తిట్టడం ప్రజాస్వామ్య విరుద్ధం.. అంబటిపై శ్రీనివాస్ వర్మ ఆగ్రహం

నన్ను మట్టుబెట్టాలనే కుట్రతోనే దాడి: జోగి రమేష్

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 02 , 2026 | 06:16 PM