సజ్జనార్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు: హరీష్‌రావు
ABN , Publish Date - Feb 02 , 2026 | 12:49 PM
ఫోన్ ట్యాపింగ్ విచారణ పూర్తి కాకముందే.. అది అక్రమం అని సజ్జనార్ ప్రకటించడం చట్ట విరుద్ధం అని బీఆర్‌ఎస్ కీలక నేత హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సీపీ, సిట్ చీఫ్ అయిన సజ్జనార్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఫోన్ ట్యాపింగ్ విచారణ పూర్తి కాకముందే.. అది అక్రమం అని సజ్జనార్ ప్రకటించడం చట్ట విరుద్ధం అని బీఆర్‌ఎస్ కీలక నేత హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సీపీ, సిట్ చీఫ్ అయిన సజ్జనార్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పోలీసుల పని దర్యాప్తు మాత్రమేనని, తీర్పులు ఇవ్వడం కాదని హరీష్ రావు హితవు పలికారు (Harish Rao anger).
ఫోన్ ట్యాపింగ్ అక్రమమా, సక్రమమా అనేది న్యాయస్థానం నిర్ణయిస్తుందని, ముందే తీర్పు ఇచ్చే అధికారం సిట్ చీఫ్‌కు ఎవరిచ్చారని ప్రశ్నించారు (Hyderabad CP Sajjanar). సిట్ చీఫ్ హోదాలో ఉన్న సజ్జనార్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ను కనీసం ప్రతిపక్ష నేతగా కూడా సజ్జనార్ గుర్తించడం లేదన్నారు. సిట్ చీఫ్ రాజకీయ ప్రకటనలు చేస్తున్నారని, అలాంటి పనులు చేయడం మానుకోవాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
అమెరికాకు వార్నింగ్.. ఇరాన్‌పై దాడి చేస్తే ప్రాంతీయ యుద్ధం తప్పదంటున్న ఖమేనీ..
స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..