అమెరికాకు వార్నింగ్.. ఇరాన్‌పై దాడి చేస్తే ప్రాంతీయ యుద్ధం తప్పదంటున్న ఖమేనీ..
ABN , Publish Date - Feb 02 , 2026 | 07:13 AM
ఇరాన్ చుట్టు పక్కల ప్రాంతాల్లో యుద్ధ నౌకలను మొహరించిన ట్రంప్ యంత్రాంగానికి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సూటిగా హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌పై అమెరికా దాడికి పాల్పడితే పశ్చిమాసియాలో ప్రాంతీయ యుద్ధం తప్పదన హెచ్చరించారు.
ఇరాన్ చుట్టు పక్కల ప్రాంతాల్లో యుద్ధ నౌకలను మొహరించిన ట్రంప్ యంత్రాంగానికి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సూటిగా హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌పై అమెరికా దాడికి పాల్పడితే పశ్చిమాసియాలో ప్రాంతీయ యుద్ధం తప్పదని హెచ్చరించారు. తాము యుద్ధ ప్రేరేపకులం కాదని, అయితే తమపై ఎవరైనా దాడి చేస్తే గట్టిగా బదులిస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై దాడి విషయంలో ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది (Khamenei warns US).
ఆది, సోమవారాల్లో హార్ముజ్ జలసంధిలో వ్యూహాత్మక సైనిక కసరత్తు నిర్వహిస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది. ఈ కసరత్తు సమయంలో తమ యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలకు ముప్పు కలిగించేందుకు ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని అమెరికా సైనిక కేంద్ర కమాండ్ హెచ్చరించింది. కాగా, ఇటీవల దేశంలో అంతర్గతంగా చెలరేగిన నిరసనలు ఓ పెద్ద కుట్ర అని ఖమేనీ వ్యాఖ్యానించారు (regional war warning).
యూరోపియన్ యూనియన్ దేశాలన్నింటినీ ఉగ్రవాద సంస్థలుగా పరిగణిస్తామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ ఖాలిబాఫ్ ప్రకటించారు (Middle East conflict). యూరోపియన్ యూనియన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల నాయకులు అశాంతికి ఆజ్యం పోస్తున్నారని, తమ దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అన్నారు. అయితే తాము అమెరికాతో యుద్ధం కోరుకోవడం లేదని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి:
ఆ సంస్థలకు 2047 వరకూ ట్యాక్స్ హాలిడే: మంత్రి నిర్మలా సీతారామన్
2019 నుంచి 2026 వరకు.. 9 బడ్జెట్లు.. 14 గంటల ప్రసంగం..