సీఎంను తిట్టడం ప్రజాస్వామ్య విరుద్ధం.. అంబటిపై శ్రీనివాస్ వర్మ ఆగ్రహం
ABN , Publish Date - Feb 02 , 2026 | 01:07 PM
వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై(CM Chandrababu Naidu) వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన అసభ్య వ్యాఖ్యలను కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ(Union Minister Srinivas Varma) తీవ్రంగా ఖండించారు. సోమవారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. అంబటి రాంబాబు వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టడం ప్రజాస్వామ్య విరుద్ధమని, రాజకీయాల్లో నైతిక విలువలకు పూర్తి వ్యతిరేకమని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు కేంద్ర హోంమంత్రిని కలవవచ్చన్నారు. రాష్ట్రంలో వైసీపీ నేత చేసిన అసభ్య వ్యాఖ్యల కారణంగా రాష్ట్ర కూటమి నేతలు వ్యతిరేకత వ్యక్తం చేశారని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని రాష్ట్రపతి, హోంమంత్రిని కలవాలనుకోవడం వైసీపీ రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని శ్రీనివాస్ వర్మ అన్నారు. గత ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు పరిమితమైన వైసీపీకి.. ప్రతిపక్ష హోదా లేదని, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడం మంచిది కాదన్నారు. గౌరవప్రదమైన రాజకీయాలు చేయాలని ఆయన సూచించారు. ఏపీలో వైసీపీ ఆవిర్భావం కావడం రాష్ట్ర ప్రజల కర్మ అని కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు.
వ్యక్తిగత దూషణలు, కుటుంబ సభ్యులను దూషించడం మంచిది కాదన్నారు శ్రీనివాస్ వర్మ. కొడాలి నాని, అప్పలరాజు, అంబటి రాంబాబు లాంటివారు దూషణలు చేస్తున్నా.. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జగన్ ఇలా మాట్లాడొద్దని చెప్పిన సందర్భాలు లేవని పేర్కొన్నారు. భార్యాబిడ్డలను తిడుతుంటే జగన్ మోహన్ రెడ్డి ఆనందపడిన తీరును అందరూ చూశారని మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి..
మేడారం మహాజాతర విజయవంతం: మంత్రి సీతక్క
లండన్‌కు మంత్రి నారాయణ.. కీలక ప్రాజెక్టుల పరిశీలన
Read Latest AP News And Telugu News