Share News

వైసీపీ చర్యలపై అప్రమత్తంగా ఉండండి.. సీనియర్ మంత్రుల హెచ్చరిక

ABN , Publish Date - Feb 02 , 2026 | 12:38 PM

వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని, అలజడులు సృష్టించాలని ప్లాన్ చేస్తోందని సీనియర్ మంత్రులు విమర్శించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో జరిపిన టెలీకాన్ఫరెన్స్‌లో వైసీపీ ట్రాప్‌లో పడొద్దని టీడీపీ నేతలకు సూచించారు.

వైసీపీ చర్యలపై అప్రమత్తంగా ఉండండి.. సీనియర్ మంత్రుల హెచ్చరిక
Senior Ministers

అమరావతి, ఫిబ్రవరి 2: కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలతో టీడీపీ సీనియర్ నేతలు మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వైసీపీ కవ్వింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని వైసీపీ(YCP) ప్లాన్ చేస్తోందని.. అందుకే ఆ పార్టీ నేతలు బూతు పురాణం ఎంచుకున్నారని మంత్రులు తెలిపారు. వారి ట్రాప్‌లో పడొద్దని టీడీపీ నేతలకు సూచించారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా వైసీపీ నేతలు బూతులు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలంతా వైసీపీని చీదరించుకుంటున్నారన్నారు. 20 నెలలుగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని.. ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని వారు తెలిపారు.


ఇటీవల కాలంలో వైసీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టిస్తున్నారని సీనియర్ మంత్రులు తెలిపారు. రెండు రోజులుగా జరిగిన సంఘటనపై అప్రమత్తంగా ఉండాలన్నారు. వైసీపీ ఇలా చేయడం వల్లే 2024లో ప్రజలు వారికి అధికారం లేకుండా చేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.


ఇవి కూడా చదవండి..

మేడారం మహాజాతర విజయవంతం: మంత్రి సీతక్క

లండన్‌కు మంత్రి నారాయణ.. కీలక ప్రాజెక్టుల పరిశీలన

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 02 , 2026 | 01:51 PM