హైకోర్టును ఆశ్రయించిన జోగి రమేశ్ కుమారుడు
ABN , Publish Date - Feb 02 , 2026 | 12:18 PM
వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు రోహిత్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తమ ఇంటికి నిప్పుపెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ దావాపై నేడు మధ్యాహ్నం విచారణ జరిపేందుకు అంగీకరించింది న్యాయస్థానం.
అమరావతి: వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు రోహిత్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తమ ఇంటికి నిప్పుపెట్టిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల తమ ఇంటి వద్ద జరిగిన అగ్నిప్రమాదం వెనుక ఉద్దేశపూర్వక కుట్ర ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు రోహిత్.
అదే విధంగా.. తమ ఇంటి వద్ద తగిన భద్రత కల్పించాలని కోరుతూ మరో అనుబంధ పిటిషన్‌నూ ఆయన దాఖలు చేశారు. పరిస్థితి అత్యవసరమైనదని పేర్కొంటూ ఈ వ్యాజ్యాన్ని లంచ్ మోషన్‌గా స్వీకరించాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై స్పందించిన న్యాయస్థానం.. నేడు మధ్యాహ్నం విచారణ చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
నేరమయ రాజకీయాలే వైసీపీ సిద్ధాంతం.. జగన్ అండ్ కోపై సీఎం చంద్రబాబు ఫైర్
మంత్రి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. జోగి రమేశ్‌పై కేసు నమోదు
Read Latest AP News And Telugu News