Share News

India slowest train: ఐదు గంటల్లో కేవలం 46 కి.మీ.. దేశంలోనే అత్యంత నెమ్మదైన రైలు గురించి తెలుసా..

ABN , Publish Date - Jan 01 , 2026 | 08:08 PM

ఇతర రవాణా సదుపాయాలతో పోల్చుకుంటే రైలు ప్రయాణం చాలా చవకగా, సురక్షితంగా ఉంటుంది. మన దేశంలోని దాదాపు ప్రతి ప్రాంతానికి రైల్వే కనెక్షన్ ఉంది. చాలా హై స్పీడ్ రైళ్లు ఉన్నాయి. అయితే మన దేశంలో అత్యంత నెమ్మదిగా ప్రయాణించే రైలు గురించి మీకు ఏమైనా తెలుసా?

India slowest train: ఐదు గంటల్లో కేవలం 46 కి.మీ.. దేశంలోనే అత్యంత నెమ్మదైన రైలు గురించి తెలుసా..
Indian Railways unique trains

భారతీయ రైల్ వ్యవస్థ ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటి. మన దేశంలో కొన్ని లక్షల మంది రోజూ రైళ్ల ద్వారా తమ గమ్యాలకు చేరుకుంటారు. ఇతర రవాణా సదుపాయాలతో పోల్చుకుంటే రైలు ప్రయాణం చాలా చవకగా, సురక్షితంగా ఉంటుంది. మన దేశంలోని దాదాపు ప్రతి ప్రాంతానికి రైల్వే కనెక్షన్ ఉంది. చాలా హై స్పీడ్ రైళ్లు ఉన్నాయి. అయితే మన దేశంలో అత్యంత నెమ్మదిగా ప్రయాణించే రైలు గురించి మీకు ఏమైనా తెలుసా? (slowest train in India).


భారతదేశంలో అత్యంత నెమ్మదిగా ప్రయాణించే రైలు ఏదో మీకు తెలుసా? మనం మాట్లాడుకుంటున్న రైలు మెట్టుపాళయం-ఊటీ నీలగిరి ప్యాసింజర్ ట్రైన్. ఇది గంటకు దాదాపు 10 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. ఈ ప్యాసింజర్ రైలు తమిళనాడులోని మెట్టుపాళయం నుంచి ఊటీ వరకు దాదాపు 46 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ దూరాన్ని కవర్ చేయడానికి ఈ రైలుకు పూర్తిగా 5 గంటల సమయం పడుతుంది. ఈ రైలు నెమ్మదిగా ప్రయాణించడానికి ఓ కారణం ఉంది (Nilgiri Mountain Railway).


ఈ రైలు నెమ్మదిగానే వెళ్లాలని ప్రయాణికులు కోరుకుంటారు (slow speed train India). నీలగిరి కొండలలో ప్రయాణించే ఈ రైలు ప్రయాణం ఓ అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. నీలగిరి కొండల అందాలను వీక్షించడం కోసమే ప్రయాణికులు ఈ రైలు ఎక్కుతారు. వారందరూ తనివి తీరా ప్రకృతిని వీక్షించేందుకే ఆ రైలును చాలా నెమ్మదిగా, గంటకు కేవలం పది కిలోమీటర్ల స్పీడ్‌తో మాత్రమే నడుపుతారు.


ఇవి కూడా చదవండి..

మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ 516ల మధ్యలో 519 ఎక్కడుందో 20 సెకెన్లలో కనిపెట్టండి..


సౌదీ అరేబియాలో మంచు వర్షం.. ఆ అందాన్ని ఆస్వాదించాలనుకుంటున్నారా..

Updated Date - Jan 01 , 2026 | 08:24 PM