Share News

రైళ్లలో టాయిలెట్ల కోసం ఓ వ్యక్తి లెటర్.. బ్రిటీష్ ప్రభుత్వం ఏం చేసిందంటే..

ABN , Publish Date - Jan 23 , 2026 | 03:33 PM

సుదూర ప్రయాణాలు చేయాలనుకున్నప్పుడు చాలా మందికి మొదటిగా గుర్తుకొచ్చేవి రైళ్లు మాత్రమే. బస్సులు, విమానాలతో పోల్చితే రైలు ప్రయాణం చాలా తక్కువ ఖర్చుతో, సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. రైలులోనే ఆహారం, నీరు, తినడానికి రకరకాల ఆహార పదార్థాలు లభిస్తాయి.

రైళ్లలో టాయిలెట్ల కోసం ఓ వ్యక్తి లెటర్.. బ్రిటీష్ ప్రభుత్వం ఏం చేసిందంటే..
Indian Railways toilet history

ఇంటర్నెట్ డెస్క్: బస్సులు, విమానాలతో పోల్చితే రైలు ప్రయాణం చాలా తక్కువ ఖర్చుతో, సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. రైలులోనే ఆహారం, నీరు, తినడానికి రకరకాల ఆహార పదార్థాలు లభిస్తాయి. కాలకృత్యాలు తీర్చుకోవడానికి, ఫ్రెష్ అవడానికి రైళ్లలో బాత్రూమ్‌లు కూడా ఉంటాయి. అయితే రైళ్లలో బాత్‌రూమ్‌లు ఎప్పుడు ఏర్పాటు చేశారో తెలుసా? 1919లో ఓ వ్యక్తి రాసిన లేఖ కారణంగా బ్రిటీష్ ప్రభుత్వం రైళ్లలో బాత్రూమ్‌లు ఏర్పాటు చేసింది(Indian Railways toilet history).


అఖిల్ చంద్రసేన్ అనే వ్యక్తి 1919లో రైలులో అహ్మద్‌పూర్ స్టేషన్ వరకు ప్రయాణించాడు. ఆ ప్రయాణంలో అతడు కడుపు ఉబ్బిపోయి చాలా ఇబ్బంది పడ్డాడు. దీంతో తను ఎదుర్కొన్న ఇబ్బందిని వివరిస్తూ బ్రిటీష్ ప్రభుత్వానికి ఓ లేఖ రాశాడు. 'డియర్ సర్.. నేను రైలులో అహ్మద్‌పూర్ స్టేషన్‌ వరకు ప్రయాణించాను. ఆ సమయంలో నేను విసర్జనకు వెళ్లాల్సి వచ్చింది. నేను ఓ స్టేషన్‌లో టాయిలెట్‌కు వెళ్లాను. అయితే నేను అక్కడ ఉండగానే రైలు స్టార్ట్ అయింది. గార్డు నన్ను పట్టించుకోలేదు. ఒక చేతిలో కుండ, మరో చేత్తో ధోతీని పట్టుకుని రైలు కోసం ప్లాట్‌ఫామ్‌పై పరిగెత్తాను. ఆ సమయంలో నా పంచె ఊడిపోయింది' అని పేర్కొన్నాడు (toilets in trains 1919).


'పంచె ఊడిపోవడంతో అక్కడ ఉన్న స్త్రీలు, పురుషుల ముందు నేను సిగ్గుపడవలసి వచ్చింది (Indian railway interesting facts). నేను నా రైలును కూడా మిస్ అయ్యాను. నేను అహ్మద్‌పూర్ స్టేషన్‌లోనే ఉండిపోయాను. టాయిలెట్‌కు వెళ్లిన ఓ ప్రయాణికుడి కోసం రైలు గార్డు కొన్ని నిమిషాలు కూడా ఆగకపోవడం బాధాకరం. అతడికి వెంటనే జరిమానా విధించాలని కోరుతున్నాను' అని లేఖ రాశాడు. ఈ లేఖ చదివిన బ్రిటీష్ వారు రైళ్లలో టాయిలెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. అలా అఖిల్ చంద్ర సేన్ కారణంగా, భారతీయ రైళ్లలో టాయిలెట్ సౌకర్యాలు మొదలయ్యాయి.


ఇవీ చదవండి:

తెలంగాణ ఇంటర్మీడియట్.. వచ్చే ఏడాది ఇంటర్‌ ఫస్టియర్‌కు కొత్త సిలబస్‌

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు.. 5 నిమిషాలు ఆలస్యమైనా ఓకే

Updated Date - Jan 23 , 2026 | 04:03 PM