5 నిమిషాలు ఆలస్యమైనా ఓకే
ABN , Publish Date - Jan 21 , 2026 | 05:53 AM
ఇంటర్మీడియట్ పరీక్షల విషయంలో బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్ధులు పరీక్షా కేంద్రానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్ష రాసేందుకు అనుమతించనుంది
ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి
హైదరాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ పరీక్షల విషయంలో బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్ధులు పరీక్షా కేంద్రానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్ష రాసేందుకు అనుమతించనుంది. గతేడాది అమలు చేసిన ఈ నిబంధనను ఈ ఏడాది సైతం కొనసాగించనుంది. వచ్చే నెల 25న ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలు మార్చి 18తో ముగుస్తాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయి. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుంచి మొదలై 21 వరకు రోజూ రెండు సెషన్లలో జరగనున్నాయి. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కలిపి సుమారు పది లక్షల మందికిపైగా విద్యార్ధులు హాజరుకాబోతున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే 1.75 లక్షల మంది పరీక్షలు రాయనున్నారు.