Indian Railways: సంక్రాంతి పండుగ నేపథ్యంలో రైల్వేశాఖ గుడ్‌న్యూస్..
ABN , Publish Date - Jan 11 , 2026 | 07:52 AM
సంక్రాంతి పండుగ నేపథ్యంలో రైల్వే అధికారులు శుభవార్త చెప్పారు. విజయవాడ డివిజన్ పరిధిలో రైళ్ల వేగాన్ని మరింత పెంచారు. కనిష్టంగా 10 నిమిషాల నుంచి గరిష్టంగా 150 నిమిషాల ముందే గమ్యస్థానాలకు చేరుకునేలా రైళ్ల సమయాలను రీ షెడ్యూల్ చేశారు..
(ఆంధ్రజ్యోతి, రైల్వేస్టేషన్): సంక్రాంతి (Sankranti) పండుగ నేపథ్యంలో రైల్వే అధికారులు శుభవార్త చెప్పారు. విజయవాడ డివిజన్ పరిధిలో రైళ్ల వేగాన్ని మరింత పెంచారు. కనిష్టంగా 10 నిమిషాల నుంచి గరిష్టంగా 150 నిమిషాల ముందే గమ్యస్థానాలకు చేరుకునేలా రైళ్ల సమయాలను రీ షెడ్యూల్ చేశారు. చాలాకాలంగా ట్రాక్‌లను బలోపేతం చేయటంతో పాటూ ఇంటర్ లాకింగ్ పనులు కూడా తరచూ చేపడుతూ వస్తున్నారు. ఆటోమేటిక్ సిగ్నలింగ్ విధానాన్ని కూడా తీసుకొచ్చారు. దీంతో రైళ్ల ఆలస్యం తగ్గటంతో పాటు వేగం పెరిగింది. ఈ ప్రభావం డివిజన్ పరిధిలోని పలు ముఖ్య మార్గాల్లో నడిచే రైళ్లపై పడింది..
సమయం కంటే ముందే గమ్యస్థానానికి..
విజయవాడ డివిజన్ పరిదిలో మొత్తం 26 రైళ్ల స్పీడ్ పెచ్చారు. వీటిలో విజయవాడకు సంబంధించి చూస్తే ప్రధానంగా ఐదుకు పైగానే రైళ్లు ఉన్నాయి. నెల్లూరు - గూడూరు మధ్య నడిచే రైలు (17259) నిమిషాల ముందే గమ్యస్థానాలకు చేరుకుంటుంది. విజయవాడ, గూడూరు మధ్య నడిచే రైలు (17260) 40 నిమిషాల ముందే గమ్యస్థానాలకు చేరుకుంటుంది. తిరుపతి-పూరి మధ్య నడిచే రైలు (17480) 25 నిమిషాల ముందు గమ్యస్థానాలకు చేరుకుంటుంది. పూరి-తిరుపతి మధ్య నడిచే రైలు (17479) 1.50 నిమిషాల ముందు గమ్య స్థానాలకు చేరుకుంటుంది. ఇవికాకుండా విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్ల వేగం కూడా పెరిగింది.
ఈ వార్తలు కూడా చదవండి...
మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం..
దుర్గగుడిలో అపచారం.. ఏం జరిగిందంటే..
Read Latest AP News And Telugu News