Share News

Railways Urban Infrastructure: గుడ్ న్యూస్.. రైల్వే శాఖ సమగ్ర ప్రణాళిక.. 2030 కల్లా..

ABN , Publish Date - Dec 27 , 2025 | 07:57 AM

అర్బన్ ప్రాంతాల్లో రైల్వే నెట్‌వర్క్ మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు రైల్వే శాఖ నడుం బిగించింది. 2030 కల్లా సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు సిద్ధమైంది.

Railways Urban Infrastructure: గుడ్ న్యూస్..  రైల్వే శాఖ సమగ్ర ప్రణాళిక.. 2030 కల్లా..
Indian Railways Infrastructure Upgradation

ఇంటర్నెట్ డెస్క్: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. నానాటికీ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మౌలిక వసతులను విస్తృత పరిచేందుకు రైల్వే శాఖ రంగంలోకి దిగింది. సమగ్ర ప్రణాళికను అమలు చేసేందుకు రెడీ అయ్యింది. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లోని రైళ్ల నిర్వహణకు సంబంధించి మౌలిక వసతుల సామర్థ్యాన్ని రెట్టింపు చేయనున్నారు. 2030 కల్లా పూర్తిస్థాయిలో వసతులను అప్‌గ్రేడ్ చేసేలా రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది (Railways Urban Infrastructure Expansion Plan).

రైల్వే శాఖ అధికారుల ప్రకారం, ఈ సమగ్ర ప్రణాళికలో భాగంగా వివిధ రైల్వే స్టేషన్‌లల్లో అదనపు ప్లాట్ ఫామ్‌లు, స్టేబ్లింగ్ లైన్స్, పిట్ లైన్స్, అవసరాలకు సరిపడా షంటింగ్ ఫెసిలిటీలను ఏర్పాటు చేయనున్నారు. అర్బన్ ప్రాంతాల్లో అవసరాలను బట్టి కొత్త టర్మినల్స్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. రైళ్ల నిర్వహణ, మరమ్మతుల కోసం మెగా కోచింగ్ కాంప్లెక్స్ సహా వివిధ రకాల మెయింటెనెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

ట్రెయిన్ ఫెసిలిటీ వర్క్స్ ద్వారా స్టేషన్‌ సామర్థ్యం పెంపు, పెరుగుతున్న రైళ్ల సంఖ్యకు అనుగుణంగా సిగ్నలింగ్, మల్టీట్రాకింగ్ వ్యవస్థను మెరుగుపరచనున్నారు. మొత్తం 48 నగరాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రైల్వే శాఖ నడుం బిగించింది. ప్రధాన స్టేషన్‌లలో పాటు చుట్టుపక్కల ఉన్న స్టేషన్‌లలోనూ మౌలిక వసతులను మెరుగుపరుస్తామని అధికారులు చెప్పారు.


ఈ ప్లాన్‌లో భాగంగా సబర్బన్‌తో పాటు దూర ప్రాంతాలను అనుసంధానించే నెట్‌వర్క్‌లను కూడా బలోపేతం చేయనున్నారు. ఆయా నగరాల్లో డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యేక ప్లాన్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు. అవసరాల మేరకు కొన్ని స్టేషన్‌లల్లో త్వరిత గతిన మౌలిక వసతులను మెరుగుపరచనున్నారు. ఈ మేరకు సమగ్ర ప్లాన్‌తో సిద్ధం కావాలని వివిధ జోనల్ కార్యాలయాలను రైల్వే శాఖ కోరింది. టర్మినల్స్‌ అభివృద్ధితో పాటు నిర్వహణ పరమైన సవాళ్లను కూడా దృష్టిలో పెట్టుకుని రెడీ కావాలని కోరింది. ఢిల్లీ, ముంబై (సీఆర్, డబ్ల్యూఆర్), హైదరాబాద్ సహా మొత్తం 48 అర్బన్ ప్రాంతాల్లో రైల్వే మౌలిక వసతులను అభివృద్ధి పరచనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Madras High Court: 16 ఏళ్లలోపు వారికి ఇంటర్నెట్‌ నిషేధం

20 మంది వీర బాలలకు పురస్కారాల ప్రదానం


Updated Date - Dec 27 , 2025 | 09:27 AM