Indian Railways Fare Hike: పెరిగిన రైల్వే చార్జీలు.. నేటి నుంచి అమలు
ABN , Publish Date - Dec 26 , 2025 | 08:29 AM
రైల్వే శాఖ కొత్తగా ప్రతిపాదించిన ఛార్జీల పెంపు శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. ప్రతి కిలోమీటర్ కు స్వల్పంగా (1 లేదా 2 పైసల) పెంపు ఉన్నా సబర్బన్ ప్రయాణికులు, సీజనల్ టికెట్ దారులపై భారం పడకుండా చర్యలు తీసుకున్నారు. సాధారణ, ప్రీమియం రైళ్లకు కొత్త ఛార్జీలు వర్తిస్తాయి. రిజర్వేషన్ ఫీజు, సూపర్ ఫాస్ట్ చార్జీలలో ఎలాంటి మార్పు లేదని రైల్వే అధికారులు ప్రకటించారు.
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 25: రైల్వే శాఖ(Indian Railways fare hike) కొత్తగా ప్రతిపాదించిన ఛార్జీల పెంపు శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. ప్రతి కిలోమీటర్ కు స్వల్పంగా (1 లేదా 2 పైసల) పెంపు ఉన్నా సబర్బన్ ప్రయాణికులు, సీజనల్ టికెట్ దారులపై భారం పడకుండా చర్యలు తీసుకున్నారు. సాధారణ, ప్రీమియం రైళ్లకు కొత్త ఛార్జీలు వర్తిస్తాయి. రిజర్వేషన్ ఫీజు, సూపర్ ఫాస్ట్ చార్జీలలో ఎలాంటి మార్పు లేదని రైల్వే అధికారులు ప్రకటించారు. కాగా సెకండ్ క్లాస్ ఆర్డినరీ చార్జీల్లో కి.మీ.కు 1 పైసా పెరుగుతుండగా, ప్రయాణించే దూరాన్ని బట్టి కొన్ని స్లాబ్లు పెట్టారు.
సెకండ్ క్లాస్ సీటింగ్ ప్రయాణికులకు 215 కిలోమీటర్ల వరకు ఎలాంటి పెంపు లేదు. 216 నుంచి 750 కి.మీ. దూరానికి మొత్తం టికెట్ పై రూ.5.. 751-1,250 కి.మీ. దూరానికి రూ.10.. 1,251-1,750 కి.మీ. దూరానికి రూ.15.. 1,751-2,250 కి.మీ. దూరానికి రూ.20 చొప్పున ఛార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు మెయిల్/ ఎక్స్ ప్రెస్ రైళ్లలో సెకండ్, స్లీపర్, ఏసీ క్లాస్ ల్లో ప్రయాణించే వారు కిలోమీటర్ కు 2 పైసల చొప్పున ప్రస్తుత టికెట్ ధరకంటే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. కొత్త ఛార్జీలు అమలు ముందు జారీ చేసిన టికెట్లపై ఈ పెంపు వర్తించదు.
ఈ వార్తలు కూడా చదవండి..