Share News

Dogs chasing bikes: కుక్కలు ఎప్పుడూ బైక్‌లు, కార్ల వెంట ఎందుకు పరిగెడతాయి.. అసలు కారణమేంటి..

ABN , Publish Date - Dec 25 , 2025 | 02:52 PM

కుక్కలు బైకులు, కార్ల వెంట పరుగెత్తడం అనేది చాలా సాధారణ విషయం. ముఖ్యంగా వీధి కుక్కలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి వాటి సహజ స్వభావం, భయం, పరిసరాల ప్రభావం వంటి అనేక కారణాలు ఉంటాయి.

Dogs chasing bikes: కుక్కలు ఎప్పుడూ బైక్‌లు, కార్ల వెంట ఎందుకు పరిగెడతాయి.. అసలు కారణమేంటి..
why dogs bark at vehicles

సాధారణంగా కుక్కలు ఎక్కువగా బైక్‌లు, కార్లను వెంబడిస్తూ పరుగులు పెడుతుంటాయి. కుక్కలు అలా చేయడం వల్ల ఇటీవలి కాలంలో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అసలు కుక్కలు అలా ఎందుకు చేస్తాయి. బైక్‌లు, కార్ల వెంట ఎందుకు పరుగులు పెడతాయి. కుక్కలు బైకులు, కార్ల వెంట పరుగెత్తడం అనేది చాలా సాధారణ విషయం. ముఖ్యంగా వీధి కుక్కలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి వాటి సహజ స్వభావం, భయం, పరిసరాల ప్రభావం వంటి అనేక కారణాలు ఉంటాయి (why dogs chase vehicles).


కుక్కలు వేట జంతువుల వంశానికి చెందినవి. వేగంగా కదిలే బైకులు, కార్లను చూసినప్పుడు వాటిలోని వేటాడే స్వభావం (Dogs chase instinct) మేల్కొంటుంది. వాహనాల ఇంజిన్ శబ్దం, హారన్, వేగంగా కదలడం కుక్కలను ఉద్రేకానికి లేదా భయానికి గురి చేస్తుంది. దాంతో అవి వాటి వెంటపడతాయి. చాలా వీధి కుక్కలు ఒక రోడ్డును లేదా వీధిని తమ ప్రాంతంగా భావిస్తాయి. ఆ ప్రాంతంలోకి కొత్తగా ఓ వాహనం వస్తే, దాన్ని భయపెట్టి తరిమేయాలనే ఉద్దేశంతో వెంటపడతాయి (dogs running behind cars).


అలాగే ఆయా వాహనాల నుంచి వచ్చే వాసన కూడా కుక్కలు అలా వెంటపడడానికి కారణం కావచ్చు (why dogs bark at vehicles). ఇక, కొన్ని కుక్కలు వినోదం కోసం కూడా వాహనాల వెంట పరుగెత్తుతాయి. అందుకే కుక్కలన్నీ బైక్‌లు, కార్ల వెంటపడతాయని చెప్పలేం. కొన్ని కుక్కలు మాత్రమే అలా బైక్‌లు, కార్ల వెంట పరిగెత్తి ఇబ్బందులకు గురి చేస్తాయి. కుక్కలు అలా వెంటపడినప్పుడు కంగారు పడకూడదు. భయంతో స్పీడ్ పెంచితే కుక్కల్లో వేట స్వభావం మరింత పెరుగుతుంది. నెమ్మదిగా, స్థిరంగా వెళ్తే కుక్కలు ఆసక్తి కోల్పోయి ఆగిపోతాయి.


ఇవి కూడా చదవండి..

వామ్మో.. మొసలికి ఎంత కోపం వచ్చిందో చూడండి.. ఒళ్లు జలధరించే వీడియో..


మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ ఫొటోలో పిల్లి ఎక్కడుందో 7 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 25 , 2025 | 02:52 PM