Crocodile attack: వామ్మో.. మొసలికి ఎంత కోపం వచ్చిందో చూడండి.. ఒళ్లు జలధరించే వీడియో..
ABN , Publish Date - Dec 24 , 2025 | 03:39 PM
అత్యంత బలమైన ఏనుగు కూడా నీటలోని మొసలికి చిక్కితే ప్రాణాలు కోల్పోవాల్సిందే. సింహాలు, పులులు కూడా మొసలి జోలికి వెళ్లవు. అయితే తాజాగా ఒక వ్యక్తి మొసలితో ఆటలాడాడు. దీంతో మొసలి చాలా ఆగ్రహానికి గురైంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నీటిలోని మొసలి అత్యంత బలమైనది. నీటిలోని మొసలికి చిక్కితే ఎంత పెద్ద జంతువైనా ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందే. అత్యంత బలమైన ఏనుగు కూడా నీటలోని మొసలికి చిక్కితే ప్రాణాలు కోల్పోవాల్సిందే. సింహాలు, పులులు కూడా మొసలి జోలికి వెళ్లవు. అయితే తాజాగా ఒక వ్యక్తి మొసలితో ఆటలాడాడు. దీంతో మొసలి చాలా ఆగ్రహానికి గురైంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (man provoking crocodiles).
@Am_Blujay అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. మొసళ్ళతో నిండిన సరస్సు దగ్గర ఒక వ్యక్తి నిలబడి కర్రతో వాటిని పిలుస్తున్నాడు. అతను ఒడ్డున నిలబడి కర్రతో నీటిని కదిలించాడు. ఆ సమయంలో ఒక మొసలి హఠాత్తుగా బయటకు వచ్చి అతడిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. దీంతో అతడు కాస్త వెనక్కి తగ్గాడు. అయితే ఆ తర్వాత కూడా అతడు తన చర్యలను ఆపలేదు. కర్రతో నీటిని కదిలిస్తూనే ఉన్నాడు. దాంతో మరో మొసలి వచ్చి ఆ కర్రను తన నోటితో పట్టుకుంది (shocking crocodile incident).
ఈ దృశ్యం ఒళ్లు గగుర్పాటుకు గురి చేసేలా భయంకరంగా ఉంది (man teases crocodiles). దీంతో ఆ వ్యక్తి వెనక్కి వెళ్లిపోయాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 12 లక్షల మందికి పైగా ఆ వీడియో వీక్షించారు. 7.3 వేల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. కొంత మంది అతడి ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. అది ధైర్యం కాదని, మూర్ఖత్వమని మరికొందరు విమర్శిస్తున్నారు. ఒక చిన్న పొరపాటు జరిగి ఉంటే, అతను చనిపోయేవాడని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
దీపూదాస్‌ను అన్యాయంగా చంపేశారు.. ఆడియో సందేశంలో షేక్ హసీనా
మూకదాడి ఘటనపై నిరసన.. ఢిల్లీలో బంగ్లా హైకమిషన్ వద్ద ఉద్రిక్తత
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి