Share News

Pakistan Terror: ఆపరేషన్ సిందూర్‌తో మొత్తం ధ్వంసం చేశారు: పాక్ టెర్రరిస్ట్

ABN , Publish Date - Jan 15 , 2026 | 07:15 PM

గత ఏడాది ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 26 మంది అమాయకులు చనిపోయారు. దీంతో భారత్ లో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు చెలరేగాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది భారత సైన్యం.

Pakistan Terror: ఆపరేషన్ సిందూర్‌తో మొత్తం ధ్వంసం చేశారు: పాక్ టెర్రరిస్ట్
Pahalgam terror attack

ఇంటర్నెట్ డెస్క్: గత ఏడాది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు (Terrorist) పహల్గామ్‌లో 26 మందిని దారుణంగా కాల్చి చంపారు. దీనిపై యావత్ భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పహల్గామ్ దాడికి (Pahalgam terror attack) ప్రతీకారంగా భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో గత ఏడాది మే 7న పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లో 9 ఉగ్రవాద శిభిరాలపై దాడులు నిర్వహించాయి. తాజాగా లష్కరే తోయిబా (LeT) కమాండర్ హఫీజ్ అబ్ధుల్ రవూఫ్(Hafiz Abdul Rauf) ‘ఆపరేషన్ సిందూర్’ , పాకిస్థాన్ ఉగ్రవాద విధానాలపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. హఫీజ్ అబ్దుల్ రవూఫ్ ఒక బహిరంగ ప్రకటనలో భారత్ నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ వల్ల తమ ఉగ్రవాద నెట్‌వర్క్‌కు భారీ నష్టం వాటిల్లిందని అంగీకరించినట్లు తెలుస్తుంది.


గత ఏడాది మే 6-7 తేదీల్లో మాకు ఊహించని దెబ్బ తగిలిందని ఆ ప్రకటనలో రవూఫ్ పేర్కొన్నాడు. ‘ఆపరేషన్ సిందూర్ దాడితో మా స్థావరాలు ధ్వంసం అయ్యాయి.. ఇది అతి పెద్ద దాడి’ అని అంగీకరించాడు. ఆపరేషన్ సిందూర్ దాడిలో మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియల (funeral) ప్రార్థనలకు అతను నాయకత్వం వహించారు. ఆ సమయంలో పాక్ సైనిక అధికారులు హాజరు కావడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా రవూఫ్ చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్ ప్రభుత్వం, సైన్యం ఉగ్రవాద సంస్థలకు అందిస్తున్న మద్ధతును మరోసారి స్పష్టం చేస్తుందని అంటున్నారు. కాగా, అబ్దుల్ రవూఫ్ ఇప్పటికే అమెరికా ప్రకటించిన ‘గ్లోబల్ ట్రెర్రిరిస్ట్’ జాబితాలో ఉన్నాడు.


ఇవి కూడా చదవండి..

చైనా-పాక్ ఒప్పందం చెల్లదు.. ఆ వ్యాలీ భారత్‌కు ఎందుకు కీలకం..

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jan 15 , 2026 | 08:32 PM