Shaksgam Valley: చైనా-పాక్ ఒప్పందం చెల్లదు.. ఆ వ్యాలీ భారత్‌కు ఎందుకు కీలకం..
ABN , Publish Date - Jan 14 , 2026 | 07:12 AM
వివాదాస్పద షక్సాగామ్ లోయ ప్రాంతం తమ భూభాగానికి చెందినదేనని చైనా చేస్తున్న వాదనను భారత్ మరోసారి తిప్పి కొట్టింది. ఆ వ్యాలీ అప్పగింతకు..
వివాదాస్పద షక్సాగామ్ లోయ ప్రాంతం తమ భూభాగానికి చెందినదేనని చైనా చేస్తున్న వాదనను భారత్ మరోసారి తిప్పి కొట్టింది. ఆ వ్యాలీ అప్పగింతకు సంబంధించి 1963లో చైనా-పాకిస్థాన్ మధ్య జరిగిన ఒప్పందం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత ఆర్మీ చీఫ్, జనరల్ ఉపేంద్ర ద్వివేది దేశ రాజధాని ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు (India sovereignty claim).
షక్సాగామ్ లోయ ప్రాంతంలో చైనా పలు అభివృద్ధి పనులు చేపడుతోంది. ఈ లోయ లడఖ్‌కు ఉత్తరంగా, కారకోరం పర్వత శ్రేణిలో ఉంది. ఇది సియాచిన్ గ్లేసియర్‌కు సమీపంలో ఉండటంతో మన దేశానికి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాంతంగా భావిస్తారు. 1963లో పాక్, చైనా మధ్య ఒక సరిహద్దు ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ద్వారా పాక్.. షక్సాగామ్ వ్యాలీని చైనాకు అప్పగించింది. అయితే, జమ్మూ-కశ్మీర్ పరిధిలో ఉన్న షక్సాగామ్ లోయను పాక్, చైనాకు అప్పగించడం చట్టబద్ధం కాదని భారత్ అప్పటినుంచి వాదిస్తోంది (Pakistan China occupation).
మరోవైపు చైనా మాత్రం షక్సాగామ్ ప్రాంతంలో చేపడుతున్న మౌలిక వసతుల పనులను సమర్థించుకుంటూ, అవి తమ సార్వభౌమ అధికార పరిధిలోనే ఉన్నాయని వాదిస్తోంది (India Pakistan China dispute). పాక్ కూడా చైనా వైఖరికే మద్దతు ఇస్తూ, భారత్ ఆరోపణలను తిరస్కరిస్తోంది. కాగా, షక్సాగామ్ వ్యాలీ భారత్‌లోని భూభాగమేనని, ఆ ప్రాంతాన్ని మరొక దేశానికి అప్పగించే హక్కు పాక్‌కు లేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పాక్–చైనా ఒప్పందాన్ని భారత్ ఎప్పటికీ గుర్తించదని, ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై కూడా స్పష్టంగా ప్రస్తావించేందుకు సిద్ధంగా ఉన్నామని భారత్ స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి..
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం.. ఏడాదిలో లక్ష వీసాలు రద్దు..