US visa revocation: ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం.. ఏడాదిలో లక్ష వీసాలు రద్దు..
ABN , Publish Date - Jan 13 , 2026 | 07:00 AM
డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. విదేశీ విద్యార్థులకు, ఉద్యోగస్తులకు ఇచ్చే వీసాల విషయంలో ఎన్నో పరిమితులు విధించారు. అలాగే గత ఏడాది కాలంలో ఏకంగా లక్ష వీసాలను అమెరికా రద్దు చేసింది.
డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. విదేశీ విద్యార్థులకు, ఉద్యోగస్తులకు ఇచ్చే వీసాల విషయంలో ఎన్నో పరిమితులు విధించారు. అలాగే గత ఏడాది కాలంలో ఏకంగా లక్ష వీసాలను అమెరికా రద్దు చేసింది. వీటిల్లో 8 వేల విద్యార్థి వీసాలు, 2,500 ప్రత్యేక వీసాలున్నాయి (US revoked visas).
భద్రతా బలగాలతో తలపడిన వారి వీసాలను రద్దు చేసినట్టు సోమవారం అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. వారిని తిప్పి పంపుతున్నట్టు తెలిపింది. అలాగే వీసాల రద్దు విషయంలో అమెరికా నాలుగు ప్రత్యేక కారణాలను కూడా ప్రకటించింది. వీసా గడువుని మించి అమెరికాలో ఉండడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ఇతరులపై దాడులకు దిగడం, దొంగతనాలకు పాల్పడడం వంటి పనులు చేసి దొరికిపోయిన వారి వీసాలను రద్దు చేసినట్టు అమెరికా ప్రకటించింది (visa overstays USA).
ఏడాదిలో లక్ష వీసాలను రద్దు చేయడం అమెరికా చరిత్రలో రికార్డ్ అని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు (US immigration crackdown). 2024తో పోలిస్తే ఈ సంఖ్య ఏకంగా 150 శాతం అధికం. అలాగే ప్రస్తుతం అన్ని వీసాలపై సోషల్ మీడియా వెట్టింగ్ కూడా చేస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది.
ఇవి కూడా చదవండి..
ఇంటి ఖర్చుల లెక్కలు అడిగిన భర్తపై కేసు.. సుప్రీం కోర్టు తీర్పు ఏంటంటే..
మూడు పాములతో హాస్పిటల్‌కు.. అసలేం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే..