CBI Director Praveen Sood Sick: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్‌సూద్‌కు అస్వస్థత..
ABN , Publish Date - Sep 06 , 2025 | 01:11 PM
సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్‌సూద్ అస్వస్థత చెందారు. శ్రీశైలం నుంచి వస్తుండగా ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యారు. హుటాహుటిన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
హైదరాబాద్: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్‌సూద్ అస్వస్థత చెందారు. నిన్న కాళేశ్వరం కేసుపై అధికారులతో సమావేశం అయిన ప్రవీణ్ సూద్.. సమావేశం అనంతరం శ్రీశైలం వెళ్లారు. అయితే, శ్రీశైలం నుండి వస్తుండగా ఉన్నట్టుండి ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనను హుటాహుటిన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
సమాచారం తెలియడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు సీబీఐ సీనియర్ అధికారులు అపోలో ఆస్పత్రికి చేరుకుని పరామర్శించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు అన్ని అవసరమైన పరీక్షలు చేస్తున్నారు. అస్వస్థతకు గల కారణాలపై పూర్తి సమాచారం ఇంకా వెల్లడి కాలేదు.