Ganpati Visarjan 2025: గణేశుల శోభాయాత్ర.. కిక్కిరిసిపోయిన ముంబై రోడ్లు..
ABN , Publish Date - Sep 06 , 2025 | 11:04 AM
ఈ రోజు 6500 వినాయక విగ్రహాల నిమజ్జనం జరగనుంది. ఇది కేవలం గణపతి మండపాల్లో ఉంచిన వినాయక విగ్రహాల సంఖ్య మాత్రమే. ఈ పెద్ద విగ్రహాలతో పాటు 1.5 లక్షల ఇంటి గణపతుల నిమజ్జనం కూడా ఈ రోజే జరగనుంది.
ముంబై మహా నగరంలో వినాయక చవితి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ముంబై రోడ్లు గణేశుల శోభాయాత్రతో కిక్కిరిసిపోయాయి. నేడు (శనివారం) పెద్ద సంఖ్యలో బొజ్జ గణపయ్యలు గంగమ్మను చేరనున్నారు. వినాయక నిమజ్జనాలకు సంబంధించి బీఎంసీ కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది. వినాయకుల నిమజ్జనం కోసం కొన్ని లక్షల మంది రోడ్లపైకి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. సముద్రంతో పాటు చెరువులు, నీటి కుంటలు, కృత్తిమంగా తయారు చేసిన కుంటల్లో వినాయకులను నిమజ్జనం జరుగుతోంది.
ఈ రోజు 6500 వినాయక విగ్రహాల నిమజ్జనం జరగనుంది. ఇది కేవలం గణపతి మండపాల్లో ఉంచిన వినాయక విగ్రహాల సంఖ్య మాత్రమే. ఈ పెద్ద విగ్రహాలతో పాటు 1.5 లక్షల ఇంటి గణపతుల నిమజ్జనం కూడా ఈ రోజే జరగనుంది. ఈ నేపథ్యంలో ముంబై వ్యాప్తంగా భారీ భద్రత కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ శాఖ ఏకంగా 21వేల మంది పోలీసులను రంగంలోకి దించింది. ఎస్ఆర్‌పీఎఫ్, సీఏపీఎఫ్, క్యూఆర్టీ, బీడీడీఎస్ సిబ్బంది రోడ్లపై, నిమజ్జన ప్రదేశాల్లో గస్తీ కాస్తున్నారు.
ముంబై వ్యాప్తంగా 10 వేల కెమెరాలతో సర్వేలెన్స్ సాగుతోంది. జనాలను మానిటర్ చేయడానికి పోలీసు శాఖ ఏఐని వాడుతోంది. ఆడవాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని పెద్ద సంఖ్యలో మహిళా పోలీసులను కూడా రంగంలోకి దింపింది. సాయం అవసరమైన వారు 100, 103, 112 పోలీస్ హెల్ప్‌లైన్ నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. అంతేకాదు.. వినాయక విగ్రహాల నిమజ్జనం దృశ్యాలను ఫొటోలు, వీడియోలు తీయటం.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని పోలీసు శాఖ నిషేధించింది. నిమజ్జన ప్రదేశాల్లో డ్రోన్స్ వాడకాన్ని కూడా నిషేధించింది.
ఇవి కూడా చదవండి
ఈ రెండు విషయాలకు భయపడేవారు ఎప్పటికీ విజయం సాధించలేరు.!
మద్యం ప్రియులకో బ్యాడ్ న్యూస్.. రెండురోజులు దుకాణాలు బంద్