Share News

Chanakya Niti for Success: ఈ రెండు విషయాలకు భయపడేవారు ఎప్పటికీ విజయం సాధించలేరు.!

ABN , Publish Date - Sep 06 , 2025 | 10:19 AM

జీవితంలో విజయం సాధించాలనుకునే వారు ఈ రెండు విషయాలకు ఎప్పుడూ భయపడకూడదని ఆచార్య చాణక్యుడు చెబుతున్నారు. అయితే, ఏ విషయాల గురించి చాణక్యుడు చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం..

Chanakya Niti for Success: ఈ రెండు విషయాలకు భయపడేవారు ఎప్పటికీ విజయం సాధించలేరు.!
Chanakya Niti for Success

ఇంటర్నెట్ డెస్క్: జీవితంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక భయం ఉంటుంది. కొంతమంది చీకటిని చూసి భయపడతారు, మరికొందరు తాము ప్రేమించే వ్యక్తులను కోల్పోతామని భయపడతారు. ప్రతి వ్యక్తికి ఒక్కో రకమైన భయం ఉంటుంది. కానీ ఈ రెండు విషయాలకు భయపడేవారు ఖచ్చితంగా జీవితంలో విజయం సాధించలేరని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు . ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో విజయవంతమైన జీవితానికి సంబంధించిన అనేక విషయాలను వివరించాడు. అదేవిధంగా, జీవితంలో విజయం సాధించాలనుకునే వారు ఈ రెండు విషయాలకు భయపడకూడదని ఆయన అంటున్నారు. ఆ రెండు ముఖ్యమైన అంశాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..


విమర్శలకు భయపడేవారు :

ఆచార్య చాణక్యుడి ప్రకారం, విమర్శలకు భయపడేవారు జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేరు. విమర్శలకు భయపడి తాము చేయాల్సిన పనిని చేయని వారు ఎప్పటికీ తమ లక్ష్యాలను చేరుకోలేరు. ఒక వ్యక్తి విజయం సాధించాలనుకుంటే, అతను అందరికంటే భిన్నంగా ఏదైనా ప్రయత్నించాలి. విమర్శ అనేది ఒక అవకాశం లాంటిదని, దాని ద్వారా మీరు మరింత నేర్చుకోవచ్చు, మీ తప్పులను సరిదిద్దుకోవచ్చని, విమర్శలను పట్టించుకోకుండా ముందుకు సాగిపోవాలని చాణక్యుడు చెప్పాడు. కాబట్టి, ప్రజల విమర్శలకు ఎప్పుడూ భయపడకండి.


కష్టాలు వచ్చినప్పుడు పారిపోవడం :

కష్టాలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటాయి. ఆ కష్టాలను ఎదుర్కొన్నప్పుడే విజయం సాధించగలం. కష్టాలు వస్తాయని భయపడితే లేదా దాని నుండి పారిపోతే జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేరు. కష్టాలు మనల్ని పరీక్షించడానికి వస్తాయని, ఈ పరీక్షను మీరు అధిగమిస్తే, మీ జీవితం ప్రకాశవంతంగా ఉంటుందని చాణక్యుడు చెబుతున్నాడు. కాబట్టి, ఏ కారణం చేతనైనా కష్టాలు వచ్చినప్పుడు భయపడకండి. మీరు కష్టాలను చూసి భయపడితే, మీ లక్ష్యాన్ని చేరుకోలేరు.

Updated Date - Sep 06 , 2025 | 10:19 AM