Share News

Hyderabad: మద్యం ప్రియులకో బ్యాడ్ న్యూస్.. రెండురోజులు దుకాణాలు బంద్

ABN , Publish Date - Sep 06 , 2025 | 08:49 AM

వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని శని, ఆదివారాల్లో బార్లు, మద్యం షాపులు, కల్లు దుకాణాలు మూసి ఉంటాయని సికింద్రాబాద్‌ ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ, సికింద్రాబాద్‌ ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అన్ని మద్యంషాపులు శనివారం ఉదయం నుంచి ఆదివారం సాయంత్రం ఆరు గంటల వరకు మూసి ఉంటాయని తెలిపారు.

Hyderabad: మద్యం ప్రియులకో బ్యాడ్ న్యూస్.. రెండురోజులు దుకాణాలు బంద్

- నేడు, రేపు మద్యం షాపులు బంద్‌

తిరుమలగిరి(హైదరాబాద్): వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని శని, ఆదివారాల్లో బార్లు, మద్యం షాపులు, కల్లు దుకాణాలు మూసి ఉంటాయని సికింద్రాబాద్‌ ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ జగన్మోహన్‌రెడ్డి(Secunderabad Excise Inspector Jaganmohan Reddy) తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ, సికింద్రాబాద్‌ ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌(Secunderabad Excise Police Station) పరిధిలోని అన్ని మద్యంషాపులు శనివారం ఉదయం నుంచి ఆదివారం సాయంత్రం ఆరు గంటల వరకు మూసి ఉంటాయని తెలిపారు.


city5.2.jpg

బెల్టుషాపులపై ప్రత్యేక నిఘా పెట్టామని చెప్పారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం విక్రయిస్తే తమకు సమాచారం అందించాలని చెప్పారు. ఎక్సైజ్‌ ఎస్‌ఐలు దామోదర్‌, అంజయ్య, నవనీతలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని సీఐ జగనోహ్మన్‌రెడ్డి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రేపు సంపూర్ణ చంద్రగ్రహణం

పదేళ్ల బాలుడికి గుండె పోటు.. తల్లి ఒడిలోనే కన్నుమూత

Read Latest Telangana News and National News

Updated Date - Sep 06 , 2025 | 08:49 AM