CM Siddaramaiah: బ్యాలెట్ ఎన్నికలు సబబే..
ABN , Publish Date - Sep 06 , 2025 | 12:18 PM
గ్రేటర్ బెంగళూరుతోపాటు భవిష్యత్తులో జరిగే అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించే నిర్ణయంపై సీఎం సిద్దరామయ్య సమర్థించుకున్నారు. శుక్రవారం బెంగళూరులో సీఎం మీడియాతో మాట్లాడుతూ ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ రూపంలో ఎన్నికలు జరపాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
- సీఎం సిద్దరామయ్య
బెంగళూరు: గ్రేటర్ బెంగళూరుతోపాటు భవిష్యత్తులో జరిగే అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించే నిర్ణయంపై సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) సమర్థించుకున్నారు. శుక్రవారం బెంగళూరులో సీఎం మీడియాతో మాట్లాడుతూ ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ రూపంలో ఎన్నికలు జరపాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇందుకు మా అనుభవానికి అనుగుణంగా తీర్మానించామన్నారు. ఇప్పటికీ ఎన్నో దేశాలు బ్యాలెట్ పేపర్ పద్ధతిన ఎన్నికలు జరుపుతున్నాయన్నారు.

కాగా ఇదే విషయమై డీసీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ బ్యాలెట్ పేపరుతో ఎన్నికలంటే బీజేపీకి ఎందుకు భయమని ఎద్దేవా చేశారు. బెంగళూరు(Bengaluru)లో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ ద్వారా జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బీజేపీవారికి భయమెందుకన్నారు. మేం లోక్‌సభ ఎన్నికలలో పరిశీలిస్తున్నామని, సహకారసంఘాల ఎన్నికలు మాత్రమే బ్యాలెట్ ఉంటుందన్నారు. శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయానికి అనుగుణంగానే జరుగుతాయన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పదేళ్ల బాలుడికి గుండె పోటు.. తల్లి ఒడిలోనే కన్నుమూత
Read Latest Telangana News and National News