Minister Thummala on oil Farming: ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ దేశానికి హబ్: మంత్రి తుమ్మల
ABN , Publish Date - Sep 07 , 2025 | 09:11 AM
అన్నదాతలు ఆత్మ గౌరవంతో ఆరోగ్యంగా ఉండేది ఒక్క వ్యవసాయ రంగమేనని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రానున్న రోజుల్లో రైతులకు మంచి భవిష్యత్ ఉందని ఉద్ఘాటించారు. ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ దేశానికి హబ్‌గా మారనుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబరు7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ వ్యాప్తంగా పది లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ (Oil Farming) సాగవుతోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) వ్యాఖ్యానించారు. ఇవాళ(ఆదివారం) అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీనీ ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి తుమ్మల. తరచూగా ఫ్యాక్టరీ బ్రేక్ డౌన్‌పై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పామాయిల్ గెలలు నిల్వ ఉండకుండా క్రషింగ్ చేయాలని అధికారులకు సూచించారు. ఎక్కువగా వచ్చిన పామాయిల్ గెలలు అప్పారావు పేట ఫ్యాక్టరీకి తరలించాలని మంత్రి తుమ్మల ఆదేశించారు.
అనంతరం మీడియాతో మంత్రి తుమ్మల మాట్లాడారు. 31 జిల్లాల్లో ఇరవై లక్షల ఎకరాలు ఆయిల్ పామ్ సాగుకు అనుకూల వాతావరణం ఉందని తెలిపారు. ఒక్కో ఉమ్మడి జిల్లాకు లక్ష ఎకరాల చొప్పున పది లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని సూచించారు. సిద్దిపేట పామాయిల్ రిఫైనరీని త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని చెప్పుకొచ్చారు. పామాయిల్ గెలలు టన్ను రూ.25 వేలు ఉండేలా ప్రోత్సహించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి స్వయంగా కలిసి వివరించానని గుర్తుచేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
అన్నదాతలు ఆత్మ గౌరవంతో, ఆరోగ్యంగా ఉండేది ఒక్క వ్యవసాయ రంగమేనని చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో రైతులకు మంచి భవిష్యత్ ఉందని ఉద్ఘాటించారు. ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ దేశానికి హబ్‌గా మారనుందని నొక్కిచెప్పారు. ఆయిల్ పామ్‌లో అంతర పంటల సాగు రైతులకు అదనపు ఆదాయమని తెలిపారు. ఆయిల్ ఫెడ్‌తో పాటు ప్రైవేట్ రంగంలో పామాయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీల ఏర్పాటుతో ఆయిల్ పామ్ రైతులకు దీర్ఘకాలిక మేలు జరుగుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్రేటర్ హైదరాబాద్‌లో కొనసాగుతున్న వినాయక నిమజ్జనాలు
ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ దేశానికి హబ్: మంత్రి తుమ్మల
For More TG News And Telugu News