Share News

Vinayaka Nimajjanam in Hyderabad: గ్రేటర్ హైదరాబాద్‌లో కొనసాగుతున్న వినాయక నిమజ్జనాలు

ABN , Publish Date - Sep 07 , 2025 | 07:49 AM

గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ 2 లక్షల 61 వేలకు పైగా గణేష్ ప్రతిమలను నిమజ్జనం చేశారు. ఒక్క హుస్సేన్ సాగర్‌లోనే 11వేల గణేశ్ విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి.

Vinayaka Nimajjanam in Hyderabad:  గ్రేటర్ హైదరాబాద్‌లో కొనసాగుతున్న వినాయక నిమజ్జనాలు
Vinayaka Nimajjanam in Hyderabad

హైదరాబాద్, సెప్టెంబరు7 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు (Vinayaka Nimajjanam) కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ 2 లక్షల 61 వేలకు పైగా గణేశ్ ప్రతిమలను నిమజ్జనం చేశారు. ఒక్క హుస్సేన్ సాగర్‌లోనే (Hussain Sagar) 11 వేల గణేశ్ విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. నిమజ్జన కార్యక్రమం సాఫీగా, సురక్షితంగా జరిగేలా క్షేత్రస్థాయిలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, అధికారులు పర్యవేక్షిస్తున్నారు.


నిన్నటి నుంచి నిర్విరామంగా గణేశ్ విగ్రహాల నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఇవాళ(ఆదివారం) మధ్యాహ్ననానికి ముగియనున్నాయి నిమజ్జనాలు. డీజే పాటలతో మార్మోగుతున్నాయి ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు ,హుస్సేన్ సాగర్ ప్రాంతాలు. ఇప్పటివరకు 90 శాతానికి పైగా గణేశ్ విగ్రహాల నిమజ్జనం పూర్తి అయింది. పీపుల్స్ ప్లాజా మార్గంలో క్రేన్లు మొరాయిస్తోండటంతో నిమజ్జనాలు ఆలస్యంగా అవుతున్నాయి.


వినాయక చవితి ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ 11 వేల టన్నులకు పైగా అధిక వ్యర్థాలను జీహెచ్ఎంసీ సిబ్బంది సేకరించారు. సేకరించిన వ్యర్థాలను జవహర్‌నగర్‌లోని ప్రాసెసింగ్ సెంటర్‌కు తరలించారు. నిమజ్జన పాయింట్‌లు, నిమజ్జన ఊరేగింపు మార్గాల్లో వ్యర్థాల తొలగింపును జీహెచ్ఎంసీ సిబ్బంది వేగవంతం చేశారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇవాళ(ఆదివారం), రేపు(సోమవారం) ముమ్మరంగా శానిటేషన్ డ్రైవ్‌ను జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్వహించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మహేశ్‌గౌడ్‌కు సీఎం రేవంత్‌ సన్మానం

నిమజ్జనోత్సవంలో రేవంత్‌

For More TG News And Telugu News

Updated Date - Sep 07 , 2025 | 08:01 AM