TPCC Chief: మహేశ్‌గౌడ్‌కు సీఎం రేవంత్ సన్మానం
ABN , Publish Date - Sep 07 , 2025 | 07:30 AM
టీపీసీసీ అధ్యక్షుడిగా ఏడాది పూర్తి చేసుకున్న మహేశ్‌కుమార్‌గౌడ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి సన్మానించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లోని నివాసంలో..
టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి
గాంధీభవన్‌లో రేపు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం
హైదరాబాద్ సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): టీపీసీసీ అధ్యక్షుడిగా ఏడాది పూర్తి చేసుకున్న మహేశ్‌కుమార్‌గౌడ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి సన్మానించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డిని మహేశ్‌గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు సైతం టీపీసీసీ చీఫ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో మహేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. కాగా, గాంధీభవన్‌లో సోమవారం టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. మహేశ్‌గౌడ్ అధ్యక్షతన జరిగే సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. స్థానిక ఎన్నికలకు ముందే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయా ప్రాంతాల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించే అవకాశం ఉంది.