Home » Ganesh
సంప్రదాయ ప్రకారం 18 అడుగులు ఎత్తైన లాల్ బాగ్చా రాజా గణేష్ విగ్రహం ఊరేగింపు అనంత చతుర్ధశి రోజున మొదలవుతుంది. మరుసటి ఉదయం 9 గంటల సమయంలో విగ్రహాన్ని సముద్రంలో నిమజ్జనం చేస్తారు. ఈసారి కూడా అనుకున్న సమయానికే ప్లాన్ చేశారు.
రాబోయే ఏడాది వినాయక్ సాగర్‌లో చేసే గణనాథుల నిమజ్జనాలను మంచి వర్షపు నీటిలో చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. ఇందుకోసం సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా కృషి చేయాలని కోరారు. ఇలా చేస్తే రేవంత్‌రెడ్డికి, గణేష్ భక్తులందరికీ తప్పకుండా స్వామివారి ఆశీర్వాదం లభిస్తుందని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.
పోలీసులు రెండు రోజుల పాటు నిద్ర లేకుండా గణనాథుల శోభాయాత్రలో బందోబస్తు చేశారని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యుల సమన్వయంతో అనుకున్న సమయం కంటే ముందే నిమజ్జనం పూర్తి చేశామని వివరించారు. పదిరోజులుగా గణేశ్ మండపం నిర్వాహకులను ఒప్పించి ఈ ఏడాది ముందుగానే వినాయకుల విగ్రహాలను తీయించామని సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది రోజులపాటు భక్తులు గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి ఘన వీడ్కోలు పలికారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ 2 లక్షల 61 వేలకు పైగా గణేష్ ప్రతిమలను నిమజ్జనం చేశారు. ఒక్క హుస్సేన్ సాగర్‌లోనే 11వేల గణేశ్ విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి.
తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా గణేశ్ శోభాయాత్ర కొనసాగుతోంది. శోభాయాత్రను చూడటానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో పరిసర ప్రాంతాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. ఈ సందర్భంగా వినాయకులకు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా గణేశ్ శోభాయాత్రలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో సహా వివిధ రాష్ట్రాల్లో గణేశ్ నిమజ్జనాలతో భక్తులు పరవశించిపోతున్నారు. ఇక, హైదరాబాద్ మహానగరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వేల సంఖ్యలో గణనాథుని విగ్రహాలు నగరవ్యాప్తంగా కొలువుదీరాయి. కాగా, ఇవాళ(శనివారం) 11వ రోజు కావడంతో వందల సంఖ్యలో విగ్రహాలు హుస్సేన్ సాగర్‌తో సహా పలు ప్రాంతాల్లో నిమజ్జనం అవుతున్నాయి. ఆ విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం..
ఖైరతాబాద్ విశ్వమహాగణపతి శోభాయాత్ర శనివారం ఉదయం ప్రారంభమైంది. హుస్సేన్‌సాగర్ వద్ద బడా గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ గణపతి శోభాయాత్రను చూడటానికి భక్తులు భారీగా తరలి వచ్చారు.
గణేశ్ నిమజ్జనాల సందర్భంగా ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ ఘాట్ వద్ద 40 క్రేన్లు ఏర్పాటు చేసినట్లు నగర సీపీ ఆనంద్ తెలిపారు. గణేశ్ ఉత్సవాలకు సంబంధించి సీపీ మీడియాకు వివరాలు వెల్లడించారు.
ఈనెల 6వ తేదీ నిమజ్జనం సందర్భంగా పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. 7వ తేదీ సాయంత్రం వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని అన్నారు.