Raja Singh on Ganesh Immersion: ఆ క్రెడిట్ సీఎం రేవంత్‌రెడ్డిదే.. రాజాసింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ABN , Publish Date - Sep 08 , 2025 | 12:34 PM
రాబోయే ఏడాది వినాయక్ సాగర్‌లో చేసే గణనాథుల నిమజ్జనాలను మంచి వర్షపు నీటిలో చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. ఇందుకోసం సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా కృషి చేయాలని కోరారు. ఇలా చేస్తే రేవంత్‌రెడ్డికి, గణేష్ భక్తులందరికీ తప్పకుండా స్వామివారి ఆశీర్వాదం లభిస్తుందని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబరు8 (ఆంధ్రజ్యోతి): భాగ్యనగరంలో గణేశ్ నిమజ్జనం చాలా ప్రశాంతంగా పూర్తి అయిందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Goshamahal MLA Raja Singh) వ్యాఖ్యానించారు. పోలీస్, మున్సిపల్, నీటి శాఖ, ట్రాఫిక్ శాఖ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిమజ్జన కార్యక్రమానికి బాగా సహకరించారని తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు రాజాసింగ్.
ట్యాంకుబండ్‌పై జరిగిన వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని(Ganesh Immersion) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దగ్గరుండి నిరంతరం పర్యవేక్షించారని.. ఈ క్రెడిట్ ఆయనకే దక్కుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి (CM Revanth Reddy) ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కొన్ని సూచనలు చేశారు రాజాసింగ్. వినాయక్ సాగర్ నీరు మురికిగా ఉందని.. దురదృష్టవశాత్తూ దేవుళ్ల నిమజ్జనాలను కూడా ఆ నీటిలోనే చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు రాజాసింగ్.
ఇలా చేస్తే పాపం చేస్తున్నట్లు అవుతోందని చెప్పుకొచ్చారు. వినాయక్ సాగర్ నీటిని పరిశుభ్రం చేస్తానని మాజీ సీఎం కేసీఆర్ (KCR) కూడా గతంలో చెప్పారని గుర్తుచేశారు. వినాయక్ సాగర్‌లోకి మురికి కాలువ నీరు వస్తోందని.. ఆ నీటిని మళ్లించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. వినాయక్ సాగర్‌ను వర్షపు నీటితో నింపాలని సూచించారు. రాబోయే ఏడాది వినాయక్ సాగర్‌లో (Vinayak Sagar) చేసే గణనాథుల నిమజ్జనాలను మంచి వర్షపు నీటిలో చేయాలని సూచించారు. ఇందుకోసం సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా కృషి చేయాలని కోరారు. ఇలా చేస్తే రేవంత్‌రెడ్డికి, గణేష్ భక్తులందరికీ తప్పకుండా స్వామివారి ఆశీర్వాదం లభిస్తుందని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ఊరట, పరువునష్టం దావా కేసు విచారణకు సుప్రీం నిరాకరణ
ఉప రాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరం.. మరోసారి BRS-BJP బంధం బయటపడిందన్న కాంగ్రెస్
For More TG News And Telugu News