Share News

Ganapati Shobhayatra: ఖైరతాబాద్‌ విశ్వమహాగణపతి శోభాయాత్ర.. లైవ్ కోసం క్లిక్ చేయండి..

ABN , First Publish Date - Sep 06 , 2025 | 08:52 AM

దేశవ్యాప్తంగా గణేశ్ శోభాయాత్రలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో సహా వివిధ రాష్ట్రాల్లో గణేశ్ నిమజ్జనాలతో భక్తులు పరవశించిపోతున్నారు. ఇక, హైదరాబాద్ మహానగరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వేల సంఖ్యలో గణనాథుని విగ్రహాలు నగరవ్యాప్తంగా కొలువుదీరాయి. కాగా, ఇవాళ(శనివారం) 11వ రోజు కావడంతో వందల సంఖ్యలో విగ్రహాలు హుస్సేన్ సాగర్‌తో సహా పలు ప్రాంతాల్లో నిమజ్జనం అవుతున్నాయి. ఆ విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం..

Ganapati Shobhayatra: ఖైరతాబాద్‌ విశ్వమహాగణపతి శోభాయాత్ర.. లైవ్ కోసం క్లిక్ చేయండి..
Khairatabad Ganesh immersion

Live News & Update

  • Sep 06, 2025 21:00 IST

    తెలుగుతల్లి ప్లైఓవర్ దగ్గర వినాయక నిమజ్జన సందడి

    • భారీగా తరలివస్తున్న గణనాథులు.

    • సెక్రటరీయేట్, లుంబినీ పార్క్ పరిసరాల్లో శోభాయాత్రల సందడి.

    • భారీ విగ్రహాలను ట్యాంక్ బండ్ వైపు, మీడియం, చిన్నసైజు విగ్రహాలను ఎన్టీఆర్ మార్గ్ వైపు తరలిస్తున్న అధికారులు.

    • నిమజ్జన కోసం ఏర్పాటు చేసిన డీజేల్లో రాజకీయ నాయకుల పాటలు.

    • సీఎం రేవంత్ రెడ్డి, విపక్ష నేత కేసీఆర్ పేరుతో ఆలపించిన గీతాలతో మార్మోగుతున్న డీజేలు.

    • తెలుగుతల్లి ప్లైఓవర్ దగ్గర నేతల పాటలకు పోటాపోటీగా నృత్యాలు చేస్తున్న యువత.

  • Sep 06, 2025 19:45 IST

    • అర్ధరాత్రి 12 గంటలకు బడా గణేష్‌కు కలశ పూజ నిర్వహించారు.

    • పూజల అనంతరం ట్రాలీ పైకి చేర్చారు.

    • ఈ ఏడాది 50 టన్నుల బరువుతో ఖైరతాబాద్ గణేష్‌ ఉన్నారు.

    • విజయవాడ నుంచి వచ్చిన 200 టన్నుల కేపాసిటీ గల టస్కర్‌పై బడా గణేష్‌‌ శోభాయాత్ర కొనసాగుతోంది.

    • ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్ నెంబర్ 4 వద్ద వినాయకుడిని నిమజ్జనం చేయనున్నారు.

    • ఖైరతాబాద్ గణేష్‌కు కుడి వైపున శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు, ఎడమ వైపున గజ్జలమ్మ అమ్మవారు దర్శనమిస్తున్నారు.

    • ఈ ఏడాది ఖైరతాబాద్ గణేష్‌ను 50 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.

  • Sep 06, 2025 19:40 IST

    ఖైరతాబాద్‌ విశ్వమహాగణపతి శోభాయాత్ర ప్రారంభం

    • ఖైరతాబాద్‌ విశ్వమహాగణపతి శోభాయాత్ర ఇవాళ(శనివారం) ఉదయం ప్రారంభమైంది.

    • ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో విశ్వశాంతి మహా శక్తి గణపతిగా దర్శనం ఇచ్చారు ఖైరతాబాద్ బడా గణేష్. శోభాయాత్ర మార్గంలో రూట్‌ను క్లియర్ చేస్తున్నారు పోలీసులు.

    • హుస్సేన్‌సాగర్‌ వద్ద బడా గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

    • ఖైరతాబాద్‌ గణపతి శోభాయాత్రను చూడటానికి భక్తులు భారీగా తరలి వచ్చారు.

    • పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి.

    • హుస్సేన్‌సాగర్‌ వద్ద ఖైరతాబాద్‌ గణపతి నిమజ్జనం మధ్యాహ్నం 2 గంటల్లోపు పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.

  • Sep 06, 2025 13:23 IST

    • గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహా గణపతి

    • NTR మార్గ్‌లోని క్రేన్ నెం-4 దగ్గర మహా గణపతి నిమజ్జనం

  • Sep 06, 2025 12:07 IST

    • కాసేపట్లో గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహా గణపతి

    • NTR మార్గ్‌లో క్రేన్ నెం.4 దగ్గరకు చేరుకున్న మహాగణపతి

  • Sep 06, 2025 11:44 IST

    • ఎన్టీఆర్‌ మార్గ్‌కు చేరుకున్న ఖైరతాబాద్‌ గణేశుడు

  • Sep 06, 2025 10:33 IST

    • తెలుగుతల్లి ప్లైఓవర్ చేరుకున్న ఖైరతాబాద్ భారీ గణనాథుడు

    • జన సంద్రమైన తెలుగుతల్లి ప్లైఓవర్, సెక్రటరీయేట్, లుంబినీ పార్క్ పరిసరాలు