Home » Khairatabad
ఖైరతాబాద్ మహా గణనాథుడి నిమజ్జన మహోత్సవం ఘనంగా ముగిసింది. తొమ్మిది రోజులుగా విశేష పూజలందుకున్న బడా గణేషునికి జయజయధ్వానాలతో ఘనంగా వీడ్కోలు పలికారు భక్తజనులు.
దేశవ్యాప్తంగా గణేశ్ శోభాయాత్రలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో సహా వివిధ రాష్ట్రాల్లో గణేశ్ నిమజ్జనాలతో భక్తులు పరవశించిపోతున్నారు. ఇక, హైదరాబాద్ మహానగరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వేల సంఖ్యలో గణనాథుని విగ్రహాలు నగరవ్యాప్తంగా కొలువుదీరాయి. కాగా, ఇవాళ(శనివారం) 11వ రోజు కావడంతో వందల సంఖ్యలో విగ్రహాలు హుస్సేన్ సాగర్‌తో సహా పలు ప్రాంతాల్లో నిమజ్జనం అవుతున్నాయి. ఆ విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం..
మహా నిమజ్జనం సందర్భంగా బాలాపూర్ గణేశ్ విగ్రహం మొదలుకొని హుస్సేన్‌సాగర్ వరకు గల ప్రధాన శోభాయాత్ర మార్గం (19 కిమీ)లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమల్లో ఉంటాయని సిటీ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ వెల్లడించారు.
ఖైరతాబాద్ విశ్వమహాగణపతి శోభాయాత్ర శనివారం ఉదయం ప్రారంభమైంది. హుస్సేన్‌సాగర్ వద్ద బడా గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ గణపతి శోభాయాత్రను చూడటానికి భక్తులు భారీగా తరలి వచ్చారు.
గణేశ్ నిమజ్జనాల సందర్భంగా ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ ఘాట్ వద్ద 40 క్రేన్లు ఏర్పాటు చేసినట్లు నగర సీపీ ఆనంద్ తెలిపారు. గణేశ్ ఉత్సవాలకు సంబంధించి సీపీ మీడియాకు వివరాలు వెల్లడించారు.
ఈనెల 6వ తేదీ నిమజ్జనం సందర్భంగా పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. 7వ తేదీ సాయంత్రం వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని అన్నారు.
రేపు మహా నిమజ్జనం. హుస్సేన్‌సాగర్‌తో పాటు ఇతర చోట్ల వినాయక విగ్రహాల నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సాగర తీరంలోని ఎన్‌టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, సంజీవయ్య పార్కు వైపు ఇప్పటికే క్రేన్లు అందుబాటులో ఉన్నాయి. గురువారం ట్యాంక్‌బండ్‌పై పది క్రేన్లు ఏర్పాటు చేశారు.
ఖైరతాబాద్ మహా గణపతి దర్శనాలు గురువారంతో ముగిశాయని, శుక్రవారం ఎవరూ రావొద్దని సైఫాబాద్ డివిజన్ ఏసీపీ సంజయ్ కుమార్ సూచించారు. గురువారం ఉదయం నుంచే నిమజ్జన పనులు ప్రారంభించారు.
మహానిమజ్జనం ప్రశాంతంగా, ఇబ్బందులు లేకుండా జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. నిమజ్జన శోభాయాత్ర జరిగే మార్గాన్ని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, రాచకొండ కమిషనర్ సుధీర్‌బాబు, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌లతో కలిసి బుధవారం వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఖైరతాబాద్ గణపతిని శనివారం మధ్యహ్నం 1.30 గంటల లోపు నిమజ్జనం చేయాడానికి పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేశారు. బుధవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గురువారం రాత్రి 12 వరకే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.