Share News

MLA Danam: చైనా మాంజా సమాచారం ఇస్తే నజరానా..

ABN , Publish Date - Dec 30 , 2025 | 10:20 AM

చైనా మాంజా సమాచారం ఇస్తే నగదు బహుమతి అందిస్తానని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అన్నారు. ప్రాంణాంతకంగా మారుతున్న చైనా మాంజా అమ్మకందారుల సమాచారం ఇవ్వాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎమ్మెల్యే అన్నారు.

MLA Danam: చైనా మాంజా సమాచారం ఇస్తే నజరానా..

- ఎమ్మెల్యే దానం నాగేందర్‌

హైదరాబాద్: ప్రాంణాంతకంగా మారుతున్న చైనా మాంజా అమ్మకందారుల సమాచారం ఇస్తే ఐదు వేల రూపాయలు నజరానా ఇవ్వడంతో పాటు వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌(Khairatabad MLA Danam Nagender) తెలిపారు. బంజారాహిల్స్‌ క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ చైనా మాంజా వల్ల జరుగుతున్న అనేక అనర్ధాలు తన దృష్టికి వచ్చాయని, పోలీసులు ఈ మాంజాను నిషేధించినా కొందరు రహస్యంగా అమ్ముతున్నారని అన్నారు.


city7.2.jpg

దీనివల్ల చాలా మంది మృత్యువాత పడుతున్నారని, ఇక మీదట ఖైరతాబాద్‌ నియోజకవర్గం(Khairatabad constituency) చైనా మాంజా అమ్మకం దారులను అడ్డుకునేందుకు పోలీసులతో కలిసి కాంగ్రెస్‌ కార్యకర్తలు పనిచేస్తారన్నారు. ఎక్కడైనా మాంజా అమ్ముతున్నట్టు తెలిస్తే వెంటనే క్యాంపు కార్యాలయంలోగాని, స్థానిక కాంగ్రెస్‌ నాయకుల దృష్టికిగాని తీసుకువస్తే పోలీసులతో కలిసి దాడులు నిర్వహించి కేసులు పెట్టేలా చూస్తామని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

2న మళ్లీ సభకు వస్తారా?

గర్భధారణ 30 ఏళ్లలోపే...

Read Latest Telangana News and National News

Updated Date - Dec 30 , 2025 | 10:20 AM