Hyderabad: 9999 @ రూ.18 లక్షలు
ABN , Publish Date - Jan 07 , 2026 | 06:55 AM
ఫ్యాన్సీ నంబర్ల పుణ్యమాని రవాణా శాఖకు భారీగా ఆదాయం సమకూరుతోంది. 9999 నెంబర్ కు రూ.18 లక్షలు చెల్లించి దక్కించుకున్నారు. ఖైరతాబాద్ సెంట్రల్ జోన్ కార్యాలయంలో జరిగిన వేలంలో ఈ నెంబర్‌కు అత్యధిక పోటీ నెలకొంది.
- ఫ్యాన్సీ నంబర్ల వేలంతో రవాణా శాఖకు రూ.43.57 లక్షల ఆదాయం
హైదరాబాద్ సిటీ: ఫ్యాన్నీ నంబర్ల వేలంలో రవాణా శాఖకు రూ.43.57 లక్షల ఆదాయం సమకూరింది. ఖైరతాబాద్ సెంట్రల్ జోన్ కార్యాలయం(Khairatabad Central Zone Office)లో మంగళవారం నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో టీజీ09జే 9999 నంబర్ అత్యధికంగా రూ.18 లక్షలు పలికింది. కీ స్టోన్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది.

టీజీ09కే 0006 నంబర్ రూ.7.06 లక్షలకు అనంతలక్ష్మి కుమారి నామాల(Ananthalakshmi Kumari Namala), టీజీ09కే 0005 నంబర్‌ను రూ.1.89 లక్షలకు నేహ అగర్వాల్, టీజీ09కే 0009ను రూ.లక్షకు శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్, టీజీ09కే 0001 నంబర్‌ను రూ.లక్షకు ఇషాని కమోడిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు దక్కించుకున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News